ముఖ్య కథనాలు

జియో ఇచ్చిన ఫ్రీ డాటా... నెలకు 110 కోట్ల జీబీ

ఇతర టెలికాం కంపెనీలకు చుక్కలు చూపిస్తూ.. వినియోగదారులకు డేటా సర్వీసులతో ముంచెత్తుతున్న రిలయన్స్ జియో నెలవారీ డేటా ట్రాఫిక్ ఎంతో తెలుసా...? ఊహకందనంత.. ఏకంగా నెలకు 110కోట్ల జీబీ కంటే ఎక్కువగానే జియో డేటా ట్రాఫిక్ ఉంది. రోజుకు 220 కోట్ల వాయిస్, వీడియో కాల్ మినిట్స్ జియో అందిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సర ఫలితాల సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్...

స్మార్టు వాచ్ ల ధరలు తగ్గుతున్నాయ్.. ఏది కొంటే బెస్ట్?

స్మార్టు వాచ్ లతో ఎన్నో సౌలభ్యాలున్నా కూడా ఇంకా పెద్దగా ఆదరణ పొందలేదు... ధర ఎక్కువగా ఉండడం దానికి ఓ కారణం. అయితే.. కొద్దికాలంగా స్మార్టు వాచ్ ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతేకాదు.. స్మార్టు వాచ్ లలో ఉండే ఫీచర్లతో కొన్నిటితో ఇతర వేరబుల్ గాడ్జెట్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దికాలం వీటి ధరలు కొంత తగ్గాయి. ఫీచర్ల పరంగా, ధర పరంగానూ కొనదగ్గ...

ఆధార్ డాటా లీక్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష

ఎంతో కీలకమైన ఆధార్ సమాచారం ఇట్టే బట్టబయలవుతోంది. ఏకంగా ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచే లీకవుతోంది. దీనిపై ఇప్పటికే ఎందరో అనుమానాలు వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆధార్ డాటాకు భద్రతకు ఎలాంటి ఢోకా లేదని చెబుతోంది. కానీ.. మొన్న జార్ఖండ్ లో.. నిన్న ఛండీగడ్ లో ఆధార్ డాటా లీకైన నేపథ్యంలో కేంద్రం సీరియస్ గా ఉంది. ఇలా డాటా లీకేజికి కారణమైతే మూడేళ్ల జైలు...

ఈ యాప్స్ ఉంటే అద్దె ఇల్లు వెతకడం ఎంత సులభమో..!!

ఇల్లు వెతకడం అంటే చాలా పెద్ద పని.. అందులోనూ ఇలాంటి వేసవి కాలంలో అయితే మన పని అయిపోయినట్టే. అందుకే, పెద్దగా కష్టపడకుండా సింపుల్ గా మీ చేతిలోని స్మార్టు ఫోన్ తోనే ఎంచక్కా మీరు కోరుకున్నట్లుగా ఉండే అద్దె ఇంటిని పట్టేయొచ్చు. చేయాల్సిందల్లా అద్దె ఇళ్లకు సంబంధించిన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవడమే. ఇలాంటి యాప్స్ చాలా ఉన్నప్పటికీ కొన్ని మాత్రం అచ్చంగా...

ఏపీలో యాపిల్ ఫోన్ల తయారీ?

యాపిల్ ఫోన్లంటే ఇంటర్నేషనల్ గా యమ క్రేజ్. అలాంటి సంస్థ ఇండియాలో కొత్తగా తయారీ యూనిట్ పెట్టబోతోంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో అని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఇది ఏర్పాటు చేసేలా ప్రభుత్వం వైపు నుంచి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5 లక్షల మంది ఉద్యోగాలు యాపిల్ పరిశ్రమ ఏర్పాటైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా,...

టీసీఎస్ నుంచి ఆధార్ పేమెంట్ ప్లాట్ ఫాం

ఇండియాలోని అతి పెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఆధార్ బేస్డ్ పేమెంట్ విధానం ‘మర్చంట్‌ పే’ను ప్రారంభించింది. దీని ద్వారా ఆధార్‌, క్రెడిట్‌, డెబిట్‌, ఫోన్‌ ఆధారిత చెల్లింపులన్నిటికీ ఒకే ఇంటర్ ఫేస్ ఉంటుంది. అప్పుడు యూజర్లు చెల్లింపులు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఏమాత్రం భయం లేదు.. ఆధార్ సమాచారానికి లింక్ చేసి ఉండడం...

ఇక మరింత కరెక్టుగా గూగుల్ ట్రాన్సలేషన్

గూగుల్ ఇండియా విభాగం ఇక్కడ ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి ఆదరణ పొందేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో దూసుకెళ్తోంది. తాజాగా తన ఆన్ లైన్ ట్రాన్సలేషన్ టూల్ ను మరింత మెరుగుపరచడమే కాకుండా కొత్తగా మరో 11 రీజనల్ లాంగ్వేజెస్ కు విస్తరించింది. గూగుల్ ట్రాన్సలేషన్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటికే గూగుల్ ట్రాన్సలేషన్లో ఇండియాలోని 11 రీజనల్...

జియో కొత్త టారిఫ్ లు ఇలా..

రిలయన్స్ తన డాటా ప్లాన్లను సవరించింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఈ మార్పులు చేసింది. పాత ధరల్లోనే ప్లాన్లు ఉన్నప్పటికీ డాటా వినియోగ పరిమితి మాత్రం పెంచారు. జియో ప్రీపెయిడ్ ప్లాన్లు రూ.19 నుంచి రూ.9999 వరకు ఉన్నాయి. పోస్టు పెయిడ్ లో రూ.309, రూ. 509, రూ.999 ప్లాన్లు ఉన్నాయి. ఇంతకుముందు రూ.303.. రూ.499 ప్లాన్లు ఉండేవి. రూ.309...

50 కోట్ల యూజర్లతో లింక్డిన్ రికార్డు

ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ కీలక మైలురాయిని చేరుకుంది. తన యూజర్ బేస్ లో స్థిరమైన వృద్ధిని కనబరుస్తూ 50 కోట్ల మంది వినియోగదారుల మార్క్ ను చేరుకుంది. గత ఏడాది జూన్ నాటికి ఈ సైట్ కు 43.3 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు. కాగా లింక్డ్ ఇన్ కు 200 దేశాల్లో వినియోగదారులున్నారు. వారానికి లక్ష ఆర్టికల్స్ లింక్డ్ ఇన్ ను కొద్దికాలం...

సోషల్ మీడియాలో ఏ నేరానికి ఎంత శిక్ష?

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజులుగా నలుగుతున్న సోషల్ మీడియా దుర్వినియోగం అంశం పెద్ద చర్చకే తెరలేపింది. రాజకీయ నేతలను కించపరిచేలా ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాతోపాటు ఇంటర్నెట్ లో యూజర్లు చేసే కామెంట్లు - పెట్టే పోస్టుల పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. మన దేశంలో ఏ...