• తాజా వార్తలు
  •  

అమెజాన్ ప్రైం సభ్యులా...? అయితే, ఈ ఫోన్ మీ కోసమే.. మధ్యాహ్నం 3కి బీ రెడీ


షియోమి ఫోన్ల శ్రేణిలో రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్ చౌక ధరలో దొరుకుతూ విక్రయాల్లో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ మరోసారి సేల్ కి వస్తోంది. ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రిటైల్ పార్టనర్ అమెజాన్ ఇండియాలో దీన్ని విక్రయిస్తోంది షియోమీ.
అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి విధానం మార్చారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ పరిమితంగా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. నేటి నుంచి అమెజాన్ డిస్కౌంట్ల పండుగ గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభమైన నేపథ్యంలో రెడ్ మి 4ఏ కూడా విక్రయానికి వస్తోంది.
మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ ఫోన్ సేల్ ఉంటుంది. గ్రేట్ ఇండియన్ సేల్ లో సిటీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్ ఆఫర్లు దీనికి వర్తించవు. ఈ ఫోన్ కొనుగోలుపై ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు అందించే డేటా ఆఫర్లు మాత్రం నేటి సేల్ లో అందుబాటులో ఉంటాయి. 343 రూపాయల రీఛార్జ్ ప్యాక్ పై యూజర్లు 28జీబీ 4జీ డేటాను పొందవచ్చు. డేటాతో పాటు రెడ్ మి 4ఏ కస్టమర్లు రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్, నెలకు 3000 ఉచిత ఎస్టీడీ, లోకల్ ఎస్ఎంఎస్ లు పొందుతారు. 28 రోజుల వరకు మాత్రమే ఈ ఆఫర్లు వాలిడ్ లో ఉంటాయి.

జన రంజకమైన వార్తలు