• తాజా వార్తలు

నాలుగు నెల‌ల్లో ఏపీలో హెచ్‌సీఎల్ క్యాంప‌స్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాపిట‌ల్ రీజియ‌న్‌లో హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌.. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో రీసెర్చి, డెవ‌ల‌ప్‌మెంట్, ఐటీ స‌ర్వీసెస్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేసే ప్రాసెస్ చాలా స్పీడ్‌గా జ‌రుగుతోంది. ఈ సెంట‌ర్ ఏర్పాటుకు విజ‌య‌వాడ స‌మీపంలోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో 18 ఎక‌రాల ల్యాండ్‌ను ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ హెచ్‌సీఎల్ కు ఎలాట్ చేసింది. నాలుగు నెలల్లో క్యాంప‌స్ నిర్మాణం పూర్తి చేయ‌డ‌మే టార్గెట్ అని గ‌వ‌ర్న‌మెంట్‌, హెచ్‌సీఎల్ చెబుతున్నాయి.
45 రోజుల్లో అన్ని ప‌ర్మిష‌న్లు ఇచ్చాం
మార్చి 30న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో ఏపీ గ‌వ‌ర్న‌మెంట్‌, హెచ్‌సీఎల్ మ‌ధ్య ఎంవోయూ జ‌రిగింది. ఈ డాక్యుమెంట్ల‌ను ఏపీ ఐటీ మినిస్ట‌ర్ నారా లోకేష్ శుక్ర‌వారం ఢిల్లీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ ఛైర్మన్‌ శివనాడార్‌కు అందించారు. ప్రాథమిక అవగాహన ఒప్పందం జరిగిన 45 రోజుల్లోనే ఈ సంస్థకు కావాల్సిన ల్యాండ్‌తోపాటు అన్ని ప‌ర్మిష‌న్లు ఇచ్చామ‌ని లోకేష్ చెప్పారు. ఇది దేశంలోనే రికార్డ్ అన్నారు. ఫ‌స్ట్‌పేజ్‌లో కేసరిపల్లిలో 17.86 ఎకరాల్లో ఐటీ కేంద్రం ఏర్పాటు చేస్తున్న హెచ్‌సీఎల్‌ రెండోదశలో అమరావతిలోని ఐనవోలులో 10 ఎకరాల్లో రెండో కేంద్రం ఏర్పాటు చేస్తుందని లోకేష్ చెప్పారు. హెచ్‌సీఎల్‌ నాలుగేళ్లలో విజయవాడ సెంట‌ర్‌లో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టి 5వేల మందికి జాబ్స్ క‌ల్పిస్తుంద‌ని చెప్పారు. రాబోయే రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలన్న‌ది టార్గెట్ గా పెట్టుకున్నామ‌ని చెప్పారు.
5వేల జాబ్స్ .. లోక‌ల్ యూత్‌కే
విజయవాడ సెంటర్‌లో మూడు, నాలుగేళ్ల‌లో 5వేల జాబ్స్ ఇవ్వాల‌న్న‌ది త‌మ టార్గెట్ అని హెచ్‌సీఎల్ ప్ర‌క‌టించింది. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ చాలా బాగా కోప‌రేట్ చేస్తోందన్నారు. ఈ క్యాంపస్ ను నాలుగు నెల‌ల్లో నిర్మిస్తామ‌ని, అయితే 2018 జులై నుంచి ఆప‌రేష‌న్స్ స్టార్ట్ చేస్తామన్నారు. అమరావతి హెచ్‌సీఎల్‌ సెంటర్‌ క్లయింట్లన్నీ ఫార్చూన్‌ 500 కంపెనీలేనని, అందువల్ల ఆ సెంటర్‌లో పనిచేయ‌డానికి లోక‌ల్‌గా ఉన్న యూత్‌కే ఇంటర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తామ‌ని చెప్పారు.