• తాజా వార్తలు
  •  

విజయవాడలో ఒకే రోజు 7 ఐటీ కంపెనీలు ప్రారంభించిన లోకేశ్ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పరిశ్రమకు కొత్త ఊపు తెచ్చేందుకు పునాదులు బలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలో విశాఖలో మిలీనియం టవర్స్‌ నిర్మించనున్నట్లు ఏపీ ఐటీ మంత్రి నారాలోకేశ్ ప్రకటించారు. విజయవాడ శివారులోని గన్నవరంలో మేధా టవర్స్‌లో బుధవారం ఏడు ఐటీ కంపెనీలను లోకేశ్‌ ప్రారంభించారు.

రానున్న రెండేళ్లలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు.. ఉత్పత్తి రంగంలో 5లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి త్వరలోనే చిప్‌ డిజైన్‌ కంపెనీలు కూడా రానున్నాయని తెలిపారు. తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలతో పోటీపడి కియా కార్ల కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇన్నాళ్లూ అవకాశం లేక మన యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిందని.. ఇప్పుడు రాష్ట్రంలోనే అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

కాగా ఐటీ పార్కులోని ‘మేధ’ టవర్‌లోకి ఏపీఎనఆర్‌టీ కన్సార్టియంతో కూడిన ఏడు విదేశీ, స్వదేశీ ఐటీకంపెనీలు తరలి వచ్చాయి. గ్రూప్‌ ఆంటోలిన, ఐఈఎస్‌, రోటోమేకర్‌, మెస్లోవా, చందు సాఫ్ట్‌, ఈపీ సాఫ్ట్‌ యామహ్‌ ఐటీ సొల్యూషన్స వంటివి ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా ఏర్పాటు చేస్తున్న ఐటీ కంపెనీల ద్వారా కొద్దిరోజుల్లోనే ఈప్రాంత యువతకు 1,600 కొలువులు లభించనున్నాయి.

జర్మనీ, యూఎ్‌సఏలకు చెందిన ఐటీ కంపెనీలతో పాటు స్వదేశంలోని పేరెన్నిక కలిగిన కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. దాదాపుగా 42,501 చదరపు అడుగుల స్థలంలో ఏడు కంపెనీలు ఏర్పాటు కానున్నాయి.

జన రంజకమైన వార్తలు