• తాజా వార్తలు

ఎపి లో ప్రభుత్వ పథకాలకు ఆదార్ అనుసందానం

క నుండి ప్రతి వ్యక్తికీ ఆధార్  నంబరు చాలా  కీలకం గా మారబోతొంది. రాష్ట్రం లో ని ప్రతి వ్యక్తి కి సంబందించిన ఆధారు నంబరును సేకరించి ప్రభుత్వ  పథకాలు మరియు వస్తు సేవలన్నింటీకీ దానిని అనుసంధానం చేస్తారు. అంటే ఒక వ్యక్తికి సంబందించిన ఆధార్ నంబరు  ను అతని యొక్క డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు,పట్టా దారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, మొదలైన వాటికన్నింటికీ సీడింగ్ చేస్తారు. దీని వలన ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే ప్రక్రియలొ పారదర్శకత పెరగడమే గాక మరింత వేగం గా ఉంటుంది.అవినీతి రహిత, వేగవoతమైన పార దర్శకమైన పాలనను అందించదానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే మేలనే భావనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. దీని కోసం ప్రత్యేకంగా SRDH అనే వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది.

ఈ SRDH వెబ్ సైట్ లో రాష్ట్రం లోని అందరు ప్రజల యొక్క ఆదార్  నెంబర్,పిన్ కోడ్  నెంబర్,అడ్రస్ తో సహా ఉంటాయి.