• తాజా వార్తలు
  •  

ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు ఎలా చూడాలంటే...

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌కు వేళైంది. ఏప్రిల్ 13, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.. ఐతే ప్ర‌స్తుతం విడుద‌ల‌వుతున్న ఫ‌లితాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన‌వి. ఈ ప‌లితాల‌ను మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఈ ఫ‌లితాల‌ను విడుదల చేయ‌నున్నారు. జ‌న‌ర‌ల్‌, వొకేష‌న‌ల్ కోర్సులకు సంబంధించి ఫ‌లితాల‌ను ఒకేసారి ఆయ‌న విడుదుల చేస్తారు. ఈ ఏడాది ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ను 10 ల‌క్ష‌ల మందికి పైగా హాజ‌ర‌య్యారు. ఈసారి ప‌రీక్ష‌కు ఎక్కువ‌మందే హాజ‌రు కావ‌డంతో ఉత్తీర్ణ‌త శాతం పెరిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. అందులోనూ మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యా సంస్థ‌ల మ‌ధ్య నువ్వా నేనా అన్న‌ట్లు పోటీ నెల‌కొన‌డంతో మార్కులు, ర్యాంకులు ఎవ‌రికి అనుకూలంగా ఉంటాయోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి ఇంట‌ర్మీడియ‌ట్ మార్కుల‌ను తెలుసుకోవాలంటే ఎలా? మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు మంత్రి ఫ‌లితాలు విడుద‌ల చేసిన వెంట‌నే ఇంట‌ర్నెట్‌లో ప‌లితాలు అందుబాటులో ఉంటాయి. కేవ‌లం ఇంట‌ర్నెట్ మాత్ర‌మే కాదు స్మార్టుఫోన్ల ద్వారా కూడా సుల‌భంగా ఫ‌లితాలు, ర్యాంకుల వివ‌రాలను తెలుసుకునే అవ‌కాశం ఉంది.
మొబైల్ ద్వారా ఫ‌లితాలు ఎలా చూడాలంటే...
ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ స్టూడెంట్స్ ఐపీఈ1 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాట్ టికెట్ నంబ‌ర్ టైప్ చేసి 54242 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. లేక‌పోతే ఐపీఈజీ1 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నంబ‌ర్ టైప్ చేసి 5676750 నంబ‌ర్‌కు పంపాలి. ఇంట‌ర్మీడియ‌ట్ సెకండ్ ఇయ‌ర్ స్టూడెంట్స్ ఐపీఈ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నంబ‌ర్ టైప్ చేసి 54242 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. లేక‌పోతే ఐపీఈజీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబ‌ర్ టైప్ చేసి 5676750 నంబ‌ర్‌కు పంపించాలి. మొద‌టి సంవ‌త్స‌రం ఒకేష‌న‌ల్ స్టూడెంట్స్‌.. ఐపీఈవీ1 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చిహాల్ టికెట్ నంబ‌ర్ టైప్ చేసి 54242కు పంపాలి. రెండో సంవ‌త్స‌రం విద్యార్థులు ఐపీఈవీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నంబ‌ర్ టైప్ చేసి 54242కు ఎస్ఎంఎస్ చేయాలి.
వెబ్‌సైట్ ద్వారా చూడాలంటే...
సీజీజీ.జీవోవీ.ఇన్‌, గోరిజిల్ట్స్‌.నెట్‌, మ‌న‌బ‌డి.కామ్‌, మ‌న‌బ‌డి.కో.ఇన్, ఎగ్జామ్ఈటీసీ.కామ్‌, ఎడ్యుకేష‌న్ఆంధ్ర‌.కామ్‌, బీఐఈఏపీ.జీవోవీ.ఐన్ వెబ్‌సైట్ల‌లోకి వెళ్లి ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు