• తాజా వార్తలు
  •  

వ్య‌వ‌సాయాన్ని డ్రోన్‌సాయంగా మారుస్తున్న మైక్రోసాఫ్ట్

టెలిక‌మ్యూనికేష‌న్‌, హెల్త్‌, ఎడ్యుకేష‌న్‌.. ఇలా అన్ని సెక్టార్ల‌లోనూ టెక్నాల‌జీ దూసుకుపోతోంది. ఇప్పుడు వ్య‌వ‌సాయం వంతొచ్చింది. విత్త‌నం వేయాలంటే వానొస్తుందా లేదా అని ఆకాశం వంక చూడాల్సిన ప‌ని లేదిప్పుడు. ఎప్పుడు వానొచ్చే అవ‌కాశాలున్నాయి? ఎప్పుడు విత్తితే మంచి దిగుబ‌డి వ‌స్తుంది? పం్ట‌ను ఎలాంటి చీడ‌లు ఆశిస్తున్నాయి. అన్నీ టెక్నాల‌జీయే చూసుకుంటుంది. ఏం చేయాలో మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తుంది. ఫాలో అయితే మీకు వ్య‌వ‌సాయం దండ‌గ కాదు.. పండ‌గే అవుతుంది.

మైక్రోసాఫ్ట్ ఎస్ఎంఎస్‌తో పెరిగిన దిగుబ‌డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ర్నూలు జిల్లా దేవ‌ర‌కొండ మండ‌లం రైతులు వేరుశ‌న‌గ‌, ప‌త్తి పంట‌లు వేయ‌డానికి ఇప్పుడు ఆకాశం వంక చూడ‌డం లేదు. ఇక్రిశాట్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, మైక్రోసాఫ్ట్ క‌లిసి వ్య‌వ‌సాయాన్ని టెక్నాల‌జీతో అనుసంధానించేందుకు లాస్ట్ ఇయ‌ర్ ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. మైక్రోసాఫ్ట్ త‌న అజ్యూర్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాంతో 40 సంవ‌త్స‌రాల వాతావ‌ర‌ణ వివ‌రాల‌ను స్ట‌డీ చేసి ఈ ప్రాంతంలో ఎప్పుడు పంట వేస్తే మంచి దిగుబ‌డి వ‌స్తుందో రైతుల‌కు ఎస్ఎంఎస్‌లు పంపించింది. మేలో వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని అయితే జూన్‌లోనే విత్త‌నాలు వేసుకోవాల‌ని చెప్పింది. కొంత మంది రైతులు మే లోనే వేసేశారు. త‌ర్వాత వ‌ర్షాలు ప‌డ‌క‌పోవ‌డంతో దిగుబ‌డి ప‌డిపోయింది. మైక్రోసాఫ్ట్ చెప్పినట్లు జూన్‌లో విత్త‌నాలు వేసిన 175 మంది రైతుల‌కు 40% ఎక్కువ ఈల్డ్ వ‌చ్చింది. ఈ స‌క్సెస్ చూశాక ఈ విధానాన్ని వ‌రి, జొన్న‌, మొక్క‌జొన్న వంటి పంట‌ల‌కు కూడా ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రమంతా విస్త‌రించేందుకు ఇక్రిశాట్ ప్లాన్ చేస్తోంది. ఈసారి ఏపీలో 2,500 మంది.. క‌ర్నాటక‌లో 1200 మంది రైతులు ఫాలో అయ్యారు. నెక్స్ట్ ఇయ‌ర్ ప్ర‌తి రాష్ట్రంలో 10వేల ఎక‌రాల‌కు విస్త‌రింప‌చేయాల‌న్న‌ది ప్ర‌ణాళిక‌.

డ్రోన్ల‌తో పంట తెగుళ్లు ప‌సిగ‌ట్టేస్తారు

మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థ‌లే కాదు స్టార్ట‌ప్‌లు కూడా వ్య‌వ‌సాయాన్ని టెక్నాల‌జీ సాయంతో చేయ‌డానికి ముందుకొస్తున్నాయి. ఐఐటీ మ‌ద్రాస్ గ్రాడ్యుయేట్ రాజ్‌కుమార్ అయిబోనో అనే స్టార్ట‌ప్ పెట్టారుమొక్క ఎదుగుద‌ల ఎలా ఉంది? చీడ‌పీడ‌లున్నాయా అని డ్రోన్ల ద్వారా అన్ని యాంగిల్‌్నలో ఫొటోలు తీసి అన‌లైజ్ చేస్తున్నారు. దాన్ని బ‌ట్టి నైట్రోజ‌న్‌, ఫాస్ప‌ర‌స్, పొటాషియం ఎరువులు ఎంతెంత వాడాలో రైతుల‌కు స‌జెస్ట్ చేస్తున్నారు. దీంతో ఈల్డింగ్ పెరిగింది.

జన రంజకమైన వార్తలు