• తాజా వార్తలు
  •  

ఏపీ క్యాపిటల్ ప్రోగ్రెస్ ని రియల్ టైం లో చెప్పే వెబ్ సైట్.. అమరావతి రియల్‌టైం

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఎక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది? క‌్యాపిట‌ల్ ఎప్పుడు ప్రారంభిస్తారు? హైకోర్టు, సెక్ర‌టేరియ‌ట్‌, అసెంబ్లీ వంటి పెద్ద భ‌వ‌నాలు ఎలా క‌డ‌తారు? ప‌్లాన్‌లు పూర్త‌య్యాయా? ఇలాంటి వాటిపై ఏపీ ప్ర‌జ‌ల్లో చాలా ఆసక్తి నెల‌కొని ఉంది. ఇలాంటి వివ‌రాల‌న్నీ ప్ర‌జ‌లే నేరుగా తెలుసుకునేలా ఏపీ క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) ఓ స్పెష‌ల్ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేస్తోంది. అమ‌రావ‌తి రియ‌ల్‌టైం పేరుతో వ‌చ్చే ఈ వెబ్‌సైట్ రాజ‌ధాని స‌మ‌స్త స‌మాచారాన్ని ఒక్క క్లిక్‌తో తెలుసుకునే వెసులుబాటు క‌ల్పిస్తుంది.
2018 నాటికి రాజధానిలో క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ప‌రంగా పెట్టుకున్న గోల్స్ ఏమిటి? ల‌్యాండ్ ఎక్విజైష‌న్‌, ఫండ్ రైజింగ్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది? వ‌ంటి విష‌యాల‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని రివ్యూ చేసుకోవ‌డం కోసం అమ‌రావ‌తి రియ‌ల్‌టైం వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతున్నారు. సీఎం చంద్ర‌బాబు క్యాపిట‌ల్ ప్ర‌గతిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలిపే ఒక డ్యాష్‌ బోర్డులా పనిచేసే వెబ్‌సైట్‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. దీంతో ఈ వెబ్‌సైట్‌ను త‌యారుచేస్తున్నారు. సీఎం నుంచి కామ‌న్ పీపుల్ వ‌ర‌కు అంద‌రికీ అందుబాటులో ఉంటుంది. నుంచి, సామాన్య ప్రజల వరకు ఇది అందుబాటులో ఉంటుంది.
కొన్ని విష‌యాలు మాత్రం కాన్ఫిడెన్షియ‌ల్
అమ‌రావతి రియ‌ల్ టైం వెబ్‌సైట్‌ను సీఆర్‌డీఏ నియమించిన కన్సల్టెన్సీ సంస్థ సీహెచ్‌2ఎం సిద్ధం చేస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో అందరికీ అన్ని విషయాలు చూసేందుకు వీలుండదు. సీఎం, సీఆర్‌డీఏ కమిషనర్‌, హెచ్‌వోడీలు, ప్రాజెక్టు మేనేజర్లకు వేర్వేరుగా యాక్సెస్‌ ఉంటుంది. ఎవ‌రికి సంబంధించిన ఇష్యూస్‌ను వారు రివ్యూ చేసి రిజాల్వ్ చేసుకునేలా ఏర్పాట్లు ఉంటాయి. ప్రాజెక్టు ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? ఇప్పటివరకు ఎంత పూర్తయింది? వంటి డిటెయిల్స‌న్నీ ఉంటాయి. మ‌రో 45 రోజుల్లో ఈ వెబ్‌సైట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి డేటా అప్‌డేట్‌ చేసేలా రూపొందించారు.
పాస్‌వ‌ర్డ్ కూడా అక్క‌ర్లేదు..
సాధార‌ణ ప్ర‌జ‌లు ఎలాంటి పాస్‌వర్డ్ కూడా లేకుండానే ఈ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. వీరికి ఆయా ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి సీఆర్‌డీఏ అందుబాటులో ఉంచిన సమాచారం వరకు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. అమరావతి సిటీ ప్లానింగ్‌, గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్ బిల్డింగ్‌ల నిర్మాణం, రోడ్స్‌, వాట‌ర్‌, ప‌వ‌ర్ లైన్స్ వంటి రహదారులు, నీరు, విద్యుత్తు సరఫరా లైన్లు వంటి ప్రాజెక్టులు, రైతులకు స్థలాలిచ్చిన లేఅవుట్ల‌లో ఫెసిలిటీస్ అభివృద్ధి ఇలా... రాజధానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫ‌ర్మేష‌న్ అందుబాటులో ఉంటుంది.

జన రంజకమైన వార్తలు