• తాజా వార్తలు
  •  

ఆంధ్రప్రదేశ్ లో ఫేక్ డాక్ట‌ర్ల‌కు చెక్ పెట్ట‌డానికి ఐడీ ఫ్రూఫ్ ఆధారంగా మెడిస‌న్ సేల్స్‌

ఆసుపత్రికి వెళ్లాలంటే చాలా భ‌యం ఎందుకంటే ఏ డాక్ట‌ర్ ఎలా ఉంటాడో తెలియ‌దు. ఏం ముందులు రాస్తాడో తెలియ‌దు. కొంత‌మంది డాక్ట‌ర్ల‌ను చూస్తే ఇత‌ను అస‌లు వైద్యం చ‌దివాడా అనే అనుమానం క‌లుగ‌క మాన‌దు. కొంద‌రైతే త‌మ‌కు ఎలాంటి అర్హ‌త లేక‌పోయినా నేరుగా శ‌స్త్ర చికిత్స‌లు చేసి పారేస్తుంటారు. ఏమైనా తేడాలు వ‌స్తే వెంట‌నే దుకాణం స‌ర్దేస్తారు. ఇలాంటి వారి ఆగ‌డాల‌ను అడ్డుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టెక్నాల‌జీ సాయం తీసుకుంది. అదెలాగంటే...

ఐడీ ఫ్రూఫ్ ఉంటేనే... 
ఒక‌ప్పుడు ఏ వైద్యుడైనా త‌మ ప‌ట్టా చూపిస్తే చాలు ఎక్క‌డైనా ఆసుప‌త్రి ఓపెన్ చేసి వైద్యం మొద‌లుపెట్టేసేవాడు. కానీ ఇప్పుడు ఇదంతా జాంతా నై. ఐడీ ఫ్రూఫ్ లేనిదే మందులు కూడా రాయ‌లేరు  ఎవ‌రు! కాంప్ర‌హెన్సివ్ డ్ర‌గ్ మెడిసిన్ సిస్ట‌మ్ (సీడీఎంఎస్‌)  అనే కొత్త విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. ఫేక్ డాక్ట‌ర్ల ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి, మెడిస‌న్ అమ్మ‌కాల‌ను రెగ్యుల‌రేట్ చేయ‌డానికి ఈ విధానం గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. 

60 వేల మంది ఫేక్ వైద్యులు
ప్ర‌స్తుతం ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే 60 వేల‌మంది న‌కిలీ వైద్యులు ఉన్నార‌ని స‌మాచారం. వీళ్ల‌కు ట్రిట్‌మెంట్ చేయ‌డానికి, మందులు రాయ‌డానికి ఎలాంటి అర్హ‌త లేదు. అయితే తాజాగా వ‌చ్చిన సీడీఎంఎస్ విధానం ద్వారా వీళ్ల ఆట క‌ట్టించొచ్చు. దీని కోసం ఏపీ ప్ర‌భుత్వం రూ.1.2 కోట్ల నిధుల‌ను మంజూరు చేసింది. ఈ విధానం ద్వారా త‌మ ఐడీ, వివ‌రాలు డిజిట‌ల్ విధానంలో డిస్‌ప్లే చేసిన త‌ర్వాతే ఎవ‌రైనా మందులు రాయాలి. మందులు ఇవ్వాలి. ఒక‌వేళ ఫేక్ డాక్ట‌ర్ అయిన‌ట్లేతే వారికి ఐడీలు ఉండ‌వు. వారు మందులు ఇవ్వ‌లేరు. రాయ‌లేరు.

రిజిస్ట‌ర్ చేసుకోవాల్సిందే
ఇప్ప‌టికే  64 వేల మంది వైద్యులు  ఈ విధానం ద్వారా రిజ‌స్ట‌ర్ చేసుకున్నారు. ఇంతే సంఖ్య‌లో కెమిస్టులు కూడా రిజ‌స్ట‌ర్  అయ్యారు. రిజిస్ట‌ర్ కానీ వైద్యులు, కెమిస్టులు వెంట‌నే రిజ‌స్ట‌ర్ చేసుకోవాల‌ని లేక‌పోతే వారి లైసెన్స్ ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. వైద్యులు ప్రిస్కిప్ష‌న్ చేయాలంటే ముందుగా డిజిట‌ల్ సైన్ చేయాలి. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ సీడీఎంఎస్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.                                                                                                         .                                                                                                

జన రంజకమైన వార్తలు