• తాజా వార్తలు

ఏపీలో తగ్గనున్న మొబైల్‌ రేట్లు

ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మొబైల్ పరికరాలపై పన్ను అధిక శాతంలో ఉంది. దీనితో పక్క రాష్ట్రాల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఆ మేరకు ఆదాయం భారీగా తగ్గిపోతోందని భావించిన ఏపీ సర్కార్ ప్రస్తుతం ఉన్న 14.5 శాతం వ్యాట్‌ను 5 శాతానికి తగ్గించింది. ఈమేరకు  సెల్‌ఫోన్ చార్జర్లు, బ్యాటరీలపై, స్టిల్‌ ఇమేజ్‌ వీడియో కెమెరా, బ్యాటరీచార్జర్ల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం సెల్ ఫోన్, వాటి విడిభాగాలకు అధిక డిమాండ్ ఉంది. అంతేనా ఇంటిలో ఎంత మంది ఉంటే అందరి చేతిలో తప్పని సరిగా సెల్ ఫోన్ ఉంటోంది. దీనితో ఆదాయం కూడా అంతే స్థాయిలో ఉంది. దీనిని పోగొట్టుకోవడం ఇష్టం లేని ఏపీ సర్కార్ వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.