• తాజా వార్తలు
  •  

ఏపీలో ఫ‌స్ట్‌టైమ్ ఎంసెట్ @ ఆన్‌లైన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిసారిగా ఆన్‌లైన్లో ఎంసెట్ ప‌రీక్ష జ‌ర‌గ‌బోతోంది. రేప‌టి (ఏప్రిల్ 24) నుంచి నాలుగు రోజుల‌పాటు ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో కండ‌క్ట్ చేయ‌డానికి ఏర్పాట్లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అప్ల‌యి చేయ‌డం మాత్ర‌మే తెలిసిన తెలుగు విద్యార్థుల‌కు ఇదో కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో నిర్వ‌హించే కొన్నిఎంట్ర‌న్స్ టెస్ట్‌లు ఆన్‌లైన్లోనో కండ‌క్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఏపీలో ఎంసెట్‌ను కంప్యూట‌ర్‌పై రాయాల్సి ఉంది.
ఏపీ స్టేట్ హ‌య్య‌ర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ త‌ర‌పున జేఎన్‌టీయూ కాకినాడ ఈ ఎగ్జామ్ నిర్వ‌హిస్తోంది. ఇంజినీరింగ్‌కు 1,93,469, మెడిసిన్ ఎంట్ర‌న్స్‌కు 77,676 మంది క‌లిపి టోట‌ల్‌గా ఎంసెట్‌కు 2 ల‌క్ష‌ల 72 వేల మంది అప్ల‌యి చేశారు. ఆఫ్‌లైన్ ఎగ్జామ్ లేక‌పోవ‌డంతో అంద‌రూ ఆన్‌లైన్లోనో ఎగ్జామ్ రాయాలి. రూర‌ల్ ఏరియాలోని స్టూడెంట్స్‌కు ఆన్‌లైన్ ఎగ్జామ్‌పై అవేర్‌నెస్ కోసం మార్చి 27న స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ అన్ని జూనియ‌ర్ కాలేజీల్లోనూ మాక్ టెస్ట్ కండ‌క్ట్ చేసింది.
షెడ్యూల్
ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ రాసేవారికి ఏప్రిల్‌ 24 నుంచి 27 వరకూ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మూడు రోజుల్లో టోట‌ల్‌గా ఆరుసార్లు ఇంజినీరింగ్ ప‌రీక్ష కండక్ట్ చేస్తారు. అగ్రికల్చరల్‌, మెడిక‌ల్ ఎంట్ర‌న్స్ రాసే స్టూడెంట్ల‌కు 28న ఎగ్జామ్ ఉంటుంది. ఉద‌యం, మ‌ధ్యాహ్నం రెండుసార్లు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

జన రంజకమైన వార్తలు