• తాజా వార్తలు
  •  

ఇండియాలో ఇలాంటి టెక్నాల‌జీ ఒక్క ఏపీ గ‌వ‌ర్న‌మెంటే ఇస్తోంది

పిడుగులు, ఉరుముల సమాచారంతో పాటు వాటి తీవ్రత, ప్రజల రక్షణస్థాయిని కూడా హెచ్చరించే సరికొత్త యాప్‌ను ఏపీలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆవిష్క‌రించింది.  ఇస్రో సాయంతో వజ్రపథ్ పేరుతో రూపొందించిన ఈ యాప్ ఉప‌యోగించేవారికి పిడుగులు, మెరుపుల‌కు సంబంధించిన స‌మాచారం ఎప్ప‌టిక‌ప్పుడు అందుతుంది.


ఈ యాప్‌ను ఉపయోగించే వారి మొబైల్‌లో మెరుపులు, పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని ఎరుపు వలయం,  ఆరంజ్ వలయం, పసుపు వలయం అనే మూడు కేంద్రీకృత వృత్తాల ద్వారా తెలియజేస్తుంది. 

ఎరుపు వలయం
 ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వారి చుట్టూ ఎనిమిది కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎరుపు వలయం విస్తరించి ఉంటుంది. ఇది డేంజర్ జోన్.

ఆరెంజ్ వలయం
 పిడుగు సూచిక ఆరంజ్ వలయంలో ఉంటే యాప్‌ను ఉపయోగిస్తున్న వారి చుట్టూ 8 నుంచి 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో మధ్యస్థ ప్రమాదకర ప్రాంతం.

పసుపు వలయం
 పిడుగు సూచిక పసుపు వలయంలో ఉంటే మొబైల్ వినియోగదారుడు 15 నుంచి 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో తక్కువ ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతంలో ఉన్నట్లు.

ఈ మూడు కాకుండా నీలం రంగు వలయం కనిపిస్తే మెరుపులు, పిడుగులు పడే ప్రాంతానికి దూరంగా... సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించాలి.ప్రతికూల వాతావరణ పరిస్తితుల్లో సంభవించే ఉరుములు, మెరుపులకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ ప్రజలను హెచ్చరించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విఆర్వోలకు అప్పగించింది. మొదట సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్) రూపంలో వచ్చే సందేశాలను వీఆర్వోలు ప్రజలకు తెలియజేసి వారిని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులపై అధ్యయనం, ప్రజలను అప్రమత్తం చేసే అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్రోతో ఓ ఎంఓయూ కూడా కుదుర్చుకుంది.

ఇంగ్లీష్, తెలుగులో ఎస్‌ఎంఎస్‌లు
మరోవైపు మెరుపులు, పిడుగులు పడే సమాచారంతో పాటు భూకంపాలు, వరదలు, తుపానుల సమయంలో కూడా ప్రజలకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సమాచారం అందించేందుకు బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ముందుకు వచ్చింది. దీనికి బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు సుమారు 30 నిమిషాలు ముందుగా ఇంగ్లీషు, తెలుగు భాషలలో సమాచారం అందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది.

జన రంజకమైన వార్తలు