ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సంబందించిన శాఖలు అన్నీ వారం రోజుల క్రితమే నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతి కి తరలిన సంగతి మనoదరికీ తెల్సినదే. అయితే వీటిలో కొన్ని శాఖలు వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయం లోనూ మిగతా శాఖలు విజయవాడ, గుంటూరు నగరాల లోని వివిధ ప్రాంతాల లోనూ ఏర్పాటయిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ ప్రదేశం లో ఏ శాఖ ఉన్నది ఎంతమందికి తెలుసు? ఇవి రాష్ట్ర స్థాయి శాఖాదిపతుల కార్యలయాలు కాబట్టి పనుల కోసం రాష్ట్రం నలుమూలల నుండీ ప్రజలు వస్తూ ఉంటారు. మరి వారికి సమగ్ర సమాచారం తెలిసిదేలా? దీనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ను రూపొందించిoది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు అదనపు డిజి అయిన మాదిరెడ్డి ప్రతాప్ ఈ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ పేరు ఎపి ఈ డైరెక్టరీ . హైదరాబాద్ కు చెందిన ఎం పవర్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ ఈ యాప్ రూపకల్పనలో సహాయపడిoది.ఈ యాప్ ను శుక్రవారం గుంటూరు అరండల్ పేట లోని SPF రాష్ట్ర కార్యాలయం లో ఆయన ప్రారంభించారు. ఒక్కసారి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర సమాచారం మన చేతిలో ఉన్నట్లేనని ఆయన చెప్పారు. ఎపి ఈ- డైరెక్టరీ అమీ పిలిచే ఈ యాప్ లో ఇప్పటివరకూ 30 రాష్ట్ర కార్యాలయాల వివరాలు, అవి నెలకొన్న ప్రదేశాలు, సిఎం, గవర్నర్, కలెక్టర్ లు, ఎమ్మెల్యే లు, మంత్రులు, సెక్రెటేరియట్, అసెంబ్లీ, ఎమర్జెన్సీ విభాగ కార్యాలయాలు, అంబులెన్సు, మీడియా,న్యాయ వ్యవస్థలకు సంబందించిన సమాచారం, IAS, IPS అధికారుల కార్యలయాలకు సంబందించిన పూర్తి సమాచారం ఇందులో ఉన్నట్లు తెలిపారు.మొదటి విడత లో మొత్తం 140 విభాగాల కార్యాలయాల సమాచారం దీనిలో ఉంచుతారు. రెండవ విడత లో జిల్లా స్థాయి కార్యాలయాల పూర్తీ వివరాలను కూడా ఇందులో పొందు పరచున్నారు. అదనపు ఆకర్షణ GPS సౌకర్యం ఈ యాప్ ను ఎలా పొందాలి? ఈ యాప్ ను గూగుల్ లో లేదా, ప్లే స్టోర్ లో ఎపి ఈ- డైరెక్టరీ పేరుతొ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి అప్లికేషను డౌన్ లోడ్ చేసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ లో నెట్ కనెక్షన్ లేకపోయినా ఆయా వివరాలు చూసుకోవచ్చు. నెట్ కనెక్షన్ ఉంటె వీటి వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటాయి.యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన ప్రభుత్వ శాఖ పేరు, లేదా మరే ఇతర పేరు కానీ అక్కడ టైపు చేసి సెర్చ్ చేస్తే మనకు కావలసిన సమాచారం ఓపెన్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఎపి ఈ- డైరెక్టరీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. |