• తాజా వార్తలు
  •  

ఏపీ కృష్ణ‌ప‌ట్నం పోర్టు పేప‌ర్ లెస్ కావ‌డానికి ఇ-ఎక్స్‌ప్రెస్ వే

భార‌త్‌లోనే పెద్ద డీప్ వాట‌ర్ పోర్టుగా పేరు గాంచిన కృష్ణ‌ప‌ట్నం పోర్టు ఇప్పుడు స్మార్ట్ అవుతోంది. ఖ‌ర్చుల‌ను త‌గ్గించేందుకు, ప‌నిలో వేగం పెంచేందుకు పేప‌ర్ లెస్ విధానాన్ని అవ‌లంభించాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంది. దీనికి ఇ-ఎక్స్‌ప్రెస్‌వే విధానాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు పోర్టు అధికారులు వెల్ల‌డించారు. కంటేన‌ర్ ఆప‌రేష‌న్స్ కోసం ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు వారు తెలిపారు . భార‌త నౌకా పారిశ్రామిక రంగంలో ఇది కొత్త ఒర‌వ‌డిని సృష్టిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు వారు చెప్పారు. 

డాక్యుమెంట్ ట్రాన్స్‌మిష‌న్ లేకుండా
భార‌త్ చాలా పోర్టుల్లో ఇప్ప‌టివ‌ర‌కు పురాత‌న విధానాల్లోనే కంటేన‌ర్ ప్రాసెసింగ్ న‌డుస్తోంది. కృష్ణ‌ప‌ట్నం పోర్టు కూడా ఇదే కోవకు చెందుతుంది. పేప‌ర్ వ‌ర్క్ ద్వారానే 33 శాతం కంటేన‌ర్ ప్రాసెసింగ్ జ‌రుగుతుంది. డాక్యుమెంట్‌ ట్రాన్స్‌మిష‌న్ లాంటి పాత ప‌ద్ధ‌తుల‌కు స్వ‌స్తి చెప్పి ఇ-ఎక్స్‌ప్రెస్ వే విధానాన్ని ఎంచుకుంది ఈ పోర్టు. ఈ విధానంలో అన్ని ప‌నులు టెక్నాల‌జీని ఉప‌యోగించి చేస్తారు. దీంతో పేప‌ర్ క‌న‌బ‌డ‌కుండానే ప‌ని జ‌రిగిపోతుంది. దీని వ‌ల్ల ప‌నిలో వేగం పెర‌గ‌డ‌మేకాక‌, పార‌ద‌ర్శ‌కంగా కూడా ఉంటుంది. సాధార‌ణంగా కంటేన‌ర్ షిప్పింగ్‌లో ఎంతో మంది ఉద్యోగుల‌ను గంట‌ల త‌ర‌బ‌డి ఉప‌యోగించాల్సి వ‌స్తోంది. దీనికి చెక్ పెట్టేందుకే ఇ-ఎక్స్‌ప్రెస్‌వే వ‌చ్చింది.

క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫాం
కంటేన‌ర్ షిప్‌మెంట్‌లోని ఇబ్బందుల‌ను పూర్తిగా తొల‌గించ‌డం కోసం గేట్‌వే  మీడియా ఇ-ఎక్స్‌ప్రెస్‌వే టెక్నాల‌జీని రూపొందించింది. దీన్ని క్లౌడ్ బేస్డ్ ఎలక్ట్రానిక్ ఫ్లాట్‌ఫాం  టెక్నాల‌జీతో త‌యారు చేశారు.  ఈ టెక్నాల‌జీ ఎండ్ టు ఎండ్ డాక్యుమెంటేష‌న్ ప్రాసెస్‌ను డిజిట‌లైజేష‌న్ చేస్తుంది. అంటే స‌ముద్ర ర‌వాణాకు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని ఇది క్షుణ్ణంగా నిక్షిప్తంగా చేస్తుంది. స‌క్ర‌మంగా డాక్యుమెంటేష‌న్ చేస్తుంది. చిన్న చిన్న విష‌యాల‌ను కూడా డాక్యుమెంటేష‌న్ చేస్తుంది. వెసెల్ ఆప‌రేట‌ర్లు, కంటేన‌ర్ ఆప‌రేట‌ర్లు, టెర్మిన‌ల్‌, ఫ్రీట్ ఫార్వ‌ర్డ్‌లు, ట్రాన్సాఫోర్ట‌ర్ త‌దిత‌రుల వివ‌రాల‌ను స్ప‌ష్టంగా అందిస్తుంది.

ఆన్‌లైన్‌ సేవ‌లు
అంతేకాదు స్టాక్ హోల్డ‌ర్ల‌కు ఆన్‌లైన్లో అన్ని వివ‌రాలు చూసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. అంతేకాదు ఎప్ప‌టికప్పుడు కంటేన‌ర్ మూమెంట్స్ కూడా తెలుసుకోవ‌చ్చు. కంటేన‌ర్ డాక్యుమెంటేష‌న్ రియ‌ల్‌టైమ్ స్టేట‌స్ మ‌న‌కు తెలుస్తుంది. ట్రాన్సాక్ష‌న్ల‌  కోసం సుల‌భంగా ఉండేలా క్యూఆర్ కోడ్ను ఇది జ‌న‌రేట్ చేస్తుంది. దీని వ‌ల్ల సమ‌యం చాలా ఆదా అవుతుంది.

జన రంజకమైన వార్తలు