• తాజా వార్తలు
  •  

డిజాస్టర్లపై ఏపీ గవర్నమెంటు కొత్త యాప్

దేశంలోనే పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ర్టాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కు ఏటా ప్రకృతి వైపరీత్యాల భయం ఉంటుంది. ఎప్పుడు ఏ తుపాను వస్తుందో... వరదలు వస్తాయో తెలియని పరిస్థితి. అందుకే విపత్తుల విషయంలో ప్రజలను ముందే హెచ్చరించడానికి.. అప్రమత్తం చేయడానికి ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకోవాలనుకుంటోంది. దీనికోసం దేశవిదేశాల్లో ఉపయోగిస్తున్న అధునాతన టెక్నాలజీలను పరిశీలిస్తోంది.  అన్నిట్లో ఉన్న మంచి అంశాలను తీసుకుని అత్యాధునికమైన సిస్టమ్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది.
    అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో విపత్తుల సమాచారం నిమిషాల్లో ప్రజలకు చేరుతుంది. పలుదేశాల్లో సర్వీసు ప్రొవైడర్లు కూడా ఎక్కువమంది ఉండరు. ఒకరిద్దరే ఉంటారు. దీంతో వెంటనే అందరికీ సమాచారం పంపించడం తేలికవుతోంది. ఏపీలో పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అమరావతి కేంద్రంగా అత్యాధునిక విపత్తు హెచ్చరికల సిస్టమ్ నెలకొల్పడానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీస్తోంది. దీనికోసం కొత్త యాప్ రూపొందించింది.
    
ఇది ఏఏ సమాచారం ఇస్తుంది..
తుపానుల పరిస్థితి, వరదలు, భారీ వర్షాలు, సునామీలకు సంబంధించిన సమాచారమే కాకుండా పిడుగులు ఏఏ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందో కూడా ఇది చెప్తుంది. వడగాలుల గురించి కూడా చెప్తుంది.  ఈ నెల 5న దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

స్మార్టు ఫోన్ ఉంటే ఈజీ.. లేకున్నా నో ప్రాబ్లెం
ఈ యాప్ సహాయంతో స్మార్టు ఫోన్ వాడేవారు విపత్తులకు సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. సాధారణ ఫోన్లువాడేవారికి కూడా ఎస్సెమ్మెస్ ల ద్వారా సమాచారం అందించనున్నారు.
 

జన రంజకమైన వార్తలు