• తాజా వార్తలు

బందర్ రోడ్ లో వైఫై సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో

రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో,నవ్యాంధ్ర రాజధాని అయిన విజయవాడ లోని బందర్ రోడ్ లో (ఎం.జి .రోడ్) వైఫై సేవలను ప్రారంభించింది.ఈ వైఫై సేవలను జియో నెట్ అని పిలుస్తారు.ఈ ఆదివారం విజయవాడ లో జరిగిన జియో అమరావతి మారథాన్ సందర్భం గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.జియో నిర్మిస్తున్న డిజిటల్ ఎకో సిస్టం యొక్క అనువర్తనాలను ఆస్వాదించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్దం గా ఉన్నారు.సమాజం లోని అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు  రిలయన్స్ జియో ఎల్లప్పుడూ సిద్దం గా ఉంటుందని రిలయన్స్ జియో యొక్క సౌత్ రీజియన్ హెడ్ అయిన KS వేణుగోపాల్ మీడియా తో చెప్పారు.

రిలయన్స్ జియో లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 4 జి సేవలను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న సుమారు లక్షకు పైగా ఉద్యోగులకు ఉచిత మొబైల్ సేవలను అందిస్తున్న రిలయన్స్ జియో సంస్థ వచ్చే ఏడాది మార్చ్-ఏప్రిల్ మాసాల కల్లా 4 జి సేవలను కూడా విస్తరించాలని యోచిస్తుంది. మిగతా కంపెనీ లతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ డౌన్ లోడ్ స్పీడ్ నూ,4 రెట్లు అత్యుత్తమ అప్ లోడింగ్ స్పీడ్ నూ జియో 4 జి  అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.

ఎయిర్ టెల,ఐడియా సెల్యూలర్,వోడాఫోన్ మరియు ఎయిర్ సెల్ కంపెనీలు ఇప్పటికే మార్కెట్ లో తమయొక్క 4 జి సేవలను ప్రారంభించిన నేపథ్యంలో వాటిని తట్టుకొని రిలయన్స్ జియో ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి.