• తాజా వార్తలు
  •  

ఏపీ గవర్నమెంట్ వెబ్ సైట్లలో భారీగా ఆధార్ డాటా లీకేజ్


అందరినీ కలవరపెడుతున్న ఆధార్ డాటా లీకేజి సమస్య ఇప్పుడు ఏపీ గవర్నమెంటు వెబ్ సైట్లలోనూ కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వానికి చెందిన చంద్రన్న బీమా, అలాగే ఉపాధి హామీ పనులకు సంబంధించి ఏపీలో రోజువారీ పేమెంట్ల వెబ్ సైట్ల నుంచి భారీగా ఆధార్ డాటా లీకైనట్లు సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ స్టడీ తన తాజా రిపోర్టులో బయటపెట్టింది. ఈ రిపోర్టు ఇప్పుడు సంచలనంగా మారింది.

లీకేజి ఇలా...


చంద్రన్న బీమా పథకం
సామాన్యుల కోసం ఉద్దేశించిన ఈ బీమా పథకంలో 2,05,65,453 మందిచేరారు. వారి వివరాలు జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా డీటెయిల్డ్ గా ఉన్నాయి . ప్రతి లబ్ధిదారుకు సంబందించి ప్రత్యేక పేజీ ఈ వెబ్ సైట్లో ఉంది. అందులో ఆధార్ నంబర్, పేరు, తండ్రి పేరు, వయసు, కులం, ఫోన్ నంబర్, బ్యాంకు నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకు పేరు, నామినీ పేరు, వంటివివరాలన్నీ ఉంటున్నాయి. వీటికి ఏమాత్రం భద్రత లేదని రిపోర్టులో తేల్చారు.

ఏపీలో ఉపాధి హామీ చెల్లింపులసైట్
ఏపీలో ఉపాధి హామీ కూలీలు చెల్లింపుల వెబ్ సైట్లోనే ఇదే పరిస్థితి. ఒక కోటి 13 లక్షల మంది వివరాలు అందులో ఉన్నాయి. ఇందులోనూ చాలా వ్యక్తిగత సమాచారం ఉంది. జాబ్ కార్డు నంబర్, ఆధార్ నంబర్, మొబైల్, బ్యాంకు అకౌంట్ నంబర్, ఎప్పుడెప్పుడు ఎంత డబ్బు పడింది వంటి సమాచారం అంతా ఉంది. ఇదంతా వెబ్ సైట్లో వచ్చేస్తోందనిరిపోర్టు తెలిపింది.
వీటిలో బ్యాంకు అకౌంట్లు వంటివాటిలో కొంత పార్టు అంకెలు కనపడకుండా చేసినప్పటికీ దానివల్లప్రయోజనం లేదని చెబుతున్నారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఇష్టమొచ్చినట్లుగా ఓపెన్ గా పెట్టేస్తున్నా కేంద్రంమాత్రం దొంగ మాటలు చెబుతోందన్నవిమర్శలు వస్తున్నాయి.

జన రంజకమైన వార్తలు