• తాజా వార్తలు
  •  

ఏపీలో టెక్ పాలన గురించి చంద్రబాబు అమెరికాలో ఏం చెప్పారంటే..


భారతదేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు గ్రోత్‌ ఇంజన్‌గా మారిందని ముఖ్యమంత్రి చంద్ర బాబు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఇండి యా బిజినెస్‌ కౌన్సిల్‌ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. వ్యాపార సరళీకరణలో మొదటి స్థానంలో ఉన్నామని 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలు, కార్యక్రమాలు, పథకాలు, విభా గాలన్ని ఆన్‌లైన్‌ చేసి పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తు న్నారో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

సీఎం కోర్‌ డ్యాష్‌ పనితీరును చంద్రబాబు అమెరికన్‌ పారిశ్రామికవేత్తలకు ప్రత్యక్షంగా చూపించారు. దాంతో ఆ వ్యాపార వర్గాలు సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒకేసారి భారత్‌, అమెరికాకు చెందిన వాణిజ్యవేత్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందని, తన పాత మిత్రుడు జాన్‌ ఛాంబర్స్‌ ఇక్కడే ఉన్నారన్నారు. ఆయనను 1998లో మొట్టమొదటిసారిగా ఇక్కడే కలిశానని గుర్తు చేశారు.

నవ్యాంధ్ర ప్రదేశ్‌ ఒక నాలెడ్జ్‌ హబ్‌గా రూపాంతరం చెందుతోందన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐసర్‌, నల్సర్‌, ఎయిమ్స్‌ వంటి జాతీయ స్థాయి అత్యున్నత స్థాయి విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు అయ్యాయని చెప్పారు. ఇంకా పెట్రోలియం, మెరైన్‌, లాజిస్టిక్‌ వర్సిటీలు కూడా నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు.

జన రంజకమైన వార్తలు