• తాజా వార్తలు

విప‌త్తు నిర్వ‌హ‌ణ‌కు సెక‌న్‌కు వెయ్యి ఎస్సెమ్మెస్‌లు

ప్ర‌కృతి విప‌త్తుల‌పై అప్ర‌మ‌త్తం చేయ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్‌ోమెంట్ రాపిడ్ స్పీడ్‌తో ముందుకెళుతోంది. ఇప్ప‌టికే ఏ ప్రాంతంలో పిడుగులు ప‌డ‌తాయో అర‌గంట‌, గంట ముందే హెచ్చ‌రిస్తూ పిడుగుపాటు వ‌ల్ల ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోకుండా కాపాడుతోంది. ఈ విధానం మంచి రిజ‌ల్ట్స్ ఇస్తుండ‌డంతో చాలా రాష్ట్రాలు దీన్ని స్ట‌డీ చేయ‌డానికి ఏపీకి రావ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు వాతావ‌ర‌ణ స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చేరవేసేలా ర్యాపిడ్ క‌మ్యూనికేష‌న్ సిస్టమ్‌ను ఏపీ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ డెవ‌ల‌ప్ చేసింది. కొత్త సిస్టం ద్వారా సెక‌నుకు వెయ్యి ఎస్ఎంఎస్‌లు పంప‌వ‌చ్చ‌ని విప‌త్తు నిర్వ‌హ‌ణ క‌మిష‌న‌ర్ చెప్పారు. అంటే నిముషానికి 60వేల ఎస్ఎంఎస్‌లు, గంట‌కు 36 ల‌క్ష‌ల ఎస్ఎంస్‌లు పంపించ‌వ‌చ్చు.
ఐదు టెలికం సంస్థ‌లు
ఎస్సెమ్మెస్‌లు పంపించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు 5 టెలికం కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ నెలాఖ‌రులోగా ఇందులో మూడు సంస్థ‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌బోతున్నాయి. ఎలాంటి ఇన్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చినా ప్ర‌జ‌లు అల‌ర్ట్ కావ‌చ్చ‌ని విపత్తు నిర్వహ‌ణ సంస్థ చెబుతోంది. ఇస్రోతోపాటు దేశంలో వాతావ‌ర‌ణ మార్పుల గురించి చెప్పే అత్యుత్త‌మ సంస్థ‌ల నుంచి సమాచారం తీసుకుని ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌జేయ‌నున్నారు.