• తాజా వార్తలు
  •  

అంధుల‌కు తానే క‌న్నున‌వుతానంటున్న యాప్..బీ మై ఐస్‌

టెక్నాలజీ మన జీవితాల‌ను ఎంత‌గానో మార్చేస్తోంది. టైమ్‌ను, మ‌నీని కూడా సేవ్ చేస్తోంది. మ‌నుషులు అవ‌స‌ర‌మైన చోట రోబోల‌తో ప‌ని న‌డిపిస్తోంది. ఇప్పుడు అంధుల జీవితాల‌కు కూడా త‌న‌వంతు స‌హ‌కరిస్తోంది. వ‌స్తువుల‌ను గుర్తించ‌డంలో  అంధుల‌కు, చూపు త‌క్కువున్న వారికి ఇబ్బందుల‌ను తీర్చేందుకు బీ మై ఐస్ (Be My Eyes) అనే యాప్ వ‌చ్చింది.
రెండేళ్ల కింద‌టే ఐవోఎస్‌లో
డెన్మార్క్‌కు చెందిన ఓ నాన్ ప్రాఫిట్ స్టార్ట‌ప్‌..  బీ మై ఐస్ అనే యాప్‌ను ఐవోఎస్‌లో రెండేళ్ల క్రితమే వ‌చ్చింది. లేటెస్ట్‌గా ఆండ్రాయిడ్‌లోనూ రిలీజ్ చేశారు. ఈ  యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి. అందులో ఒక క‌మ్యూనిటీ ఉంటుంది.  అంధులు లేదా చూపుత‌క్కువున్న వాళ్లు ఎండ్ యూజ‌ర్లుగా, వారికి సాయ‌ప‌డాల‌నుకునేవారు వాలంటీర్లుగా దీనిలో చేరాలి. ఇప్ప‌టికే దీనిలో 5 ల‌క్ష‌ల మంది వాలంటీర్లుగా చేరారు. 40 వేల మందికి పైగా అంధులు దీని సాయంతో త‌మ ప‌నులను ఇబ్బందులు లేకుండా చేసుకోగ‌లుగుతున్నారు. 
ఎలా ప‌ని చేస్తుంది? 
అంధులు ఏదైనా వ‌స్తువును గుర్తించ‌లేక‌పోతే అదేమిట‌ని లైవ్ వీడియో చాట్‌లో అడుగుతారు.  ఉదాహ‌ర‌ణ‌కు సూప‌ర్ మార్కెట్లో ఉన్న వ‌స్తువులు చూపించి అందులో త‌మ‌కు కావాల్సిన జ్యూస్ లేదా సాస్ ఇలా ఏదైనా వ‌స్తువు అదేనా అని అడుగుతారు. లైవ్ వీడియోచాట్ కాబ‌ట్టి వాలంటీర్లు ఆ వ‌స్తువు ఎక్క‌డుందో చెప్పి సాయ‌ప‌డ‌తారు. వ‌స్తువు మీద ఎక్స్‌పైరీ డేట్‌, ప్రైస్ వంటి వివ‌రాల గురించి ఇలా ఏ విష‌య‌మైనా యూజ‌ర్లు అడిగితే వాలంటీర్లు సాయ‌ప‌డ‌తారు. బ‌స్టాప్‌లో లేదా రైల్వేస్టేష‌న్ల‌లో ట్రైన్ లేదా బ‌స్సు ఎరైవ‌ల్ వివ‌రాలు బోర్డులో చూసి చెప్ప‌డం వంటి హెల్ప్ చేయొచ్చు. ఈ యాప్ లో లైవ్ స‌ర్వీసు మీ భాష‌లో, 24 గంట‌లూ అందుబాటులో ఉంటుంది. ఎక్కువ‌మందికి 45 సెక‌న్ల‌లోపే సాయం చేయ‌గ‌లిగాం. ఇది మా వాలంటీర్ల పెద్ద మ‌న‌సే అంటున్నారు యాప్ డెవ‌ల‌ప‌ర్స్‌. 

 

జన రంజకమైన వార్తలు