ట్రూ కాలర్‌తో మీరు ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఆ నెంబర్ ఎవరి పేరు మీదయినా సేవ్ అయి ఉంటే ఆ పేరుతోనే మీకు కనిపిస్తుంది. కానీ 232 దేశాల ఫోన్ నెంబర్ల వివరాలు చెప్పేయగల ఓ వెబ్సైట్ ఉంది. దాని పేరు నంవెరిఫై (Numverify). ఇది ఒక ఫ్రీ గ్లోబల్ ఫోన్ నెంబర్ లుక్ అప్ వెబ్సైట్.
ఎలా పని చేస్తుంది?
మీరు ఫోన్ నెంబర్, కంట్రీకోడ్తో పాటు ఈ వెబ్సైట్లో ఎంటర్ చేస్తే ఆ నెంబర్ డిటెయిల్సన్నీ చూపెడుతుంది. ఇంటర్నేషనల్ ఫార్మాట్, లోకల్ ఫార్మాట్, లైన్ టైప్, క్యారియర్ (మొబైల్ నెట్వర్క్), ఆ నెంబర్ పని చేస్తుందా లేదా వంటి వివరాలన్నీ చెప్పేస్తంఉది. ఈ వెబ్‌సైట్‌తోపాటు ఫ్రీ ఏపీఐకూడా ఉంది. ఒక యూఆర్ఎల్ను యూజ్ చేసి మీ మొబైల్ నెంబర్‌ను వెరిఫై చేస్తుంది ఈ ఏపీఐ. ఫ్రీ వెర్షన్లో నెలకు 250 ఏపీఐ కాల్స్‌ను ఫ్రీగా చూసుకోవచ్చు. Numverify అనేది ఒక ఓపెన్ సోర్స్ టూల్. నేరుగా బ్రౌజర్లో దీన్ని ఎంటర్ చేయెచ్చు. నెంవెరిఫై ద్వరా రెండు రకాలుగా ఫోన్ నెంబర్లు వెరిఫై చేసుకోవచ్చు.
వెబ్సైట్ ద్వారా
1.https://numverify.com/ అని మీ బ్రౌజర్లో టైప్ చేయండి. నంవెరిఫై వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
2. హోంపేజీలోకి వెళ్లి అక్కడ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయడానికి ఉన్న బాక్స్‌లో నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ వివరాలన్నీ వస్తాయి.
3. దీనికి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. అయితే ఈ పద్ధతిలో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అంత పక్కాగా పనిచేయదు.
ఫోన్ వెరిఫికేషన్ ద్వారా
1. రెండో పద్ధతిలో వెబ్సైట్ API service ద్వారా ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోవచ్చు.
2. దీనికోసం హోం పేజీలో ఉన్న sign up for freeను క్లిక్ చేసి అకౌట్ క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ అయ్యాక మీకు API key వస్తుది.
3. మీ ఈ మెయిల్ ఐడీ , పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి కావలసిన ఫోన్ నెంబర్ వివరాలు తెలుసుకోవచ్చు.
API key ద్వారా
http://apilayer.net/api/validate?access_key తర్వాత మీకు వచ్చిన API keyతోపాటు బ్రౌజర్లో ఎంటర్ చేస్తే మీకు కావల్సిన ఫోన్ నెంబర్ వివరాలు తెలుసుకోవచ్చు.