• తాజా వార్తలు

జీ మెయిల్‌లో మ‌న ప‌నుల‌న్నీ మ‌న‌కంటే శ్ర‌ద్ధ‌గా చేసే మెయిల్ ట్యాగ్‌

ఇంపార్టెంట్ మెయిల్ పంపించారు. ఆ ప‌ర్స‌న్ దాన్ని చూశారా?  చూసి రిప్ల‌యి ఇవ్వ‌లేదా?  ఆ వ్య‌క్తి తిరిగి మెయిల్ చేస్తేనో లేక‌పోతే మీకు చెబితేనో త‌ప్ప మీకు తెలిసే అవ‌కాశ‌మే లేదు. దీన్ని ఎలా ట్రాక్ చేయాలి? అనుకుంటున్నారా?  అందుకో సింపుల్ సొల్యూష‌న్ ఉంది. అదే మెయిల్ ట్యాగ్‌. దీంతో మీరు  మీ  జీమెయిల్‌ను ట్రాక్ చేయొచ్చు. అంతేకాదు షెడ్యూల్ చేసుకోవ‌చ్చు. ఆటో ఫాలో అప్ ఆప్ష‌న్ కూడా ఉంది. 
 

మెయిల్ ట్యాగ్ క‌థేంటి?
మెయిల్ ట్యాగ్ అనేది ఒక క్రోమ్ (బ్రౌజ‌ర్‌) ఎక్స్‌టెన్ష‌న్‌. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే జీమెయిల్‌, జీసూట్‌తో ఇంటిగ్రేట్ అయి ప‌ని చేస్తుంది. మీరు ఈమెయిల్ పంపించిన‌ప్పుడు మెయిల్ ట్యాగ్ దానికి ఒక ఇమేజ్‌ను ఎటాచ్ చేస్తుంది. మెయిల్ రిసీవ్ చేసుకున్న వ్య‌క్తి  మెయిల్ ఓపెన్ చేయ‌గానే ఇమేజ్ లోడ్ అవ‌డం మొద‌ల‌వుతుంది. దాన్ని బ‌ట్టి ఆ ప‌ర్స‌న్ మీ మెయిల్ ఓపెన్ చేశాడ‌ని మెయిల్ ట్యాగ్ గుర్తిస్తుంది. రియ‌ల్‌టైమ్ నోటిఫికేష‌న్స్ ఇవ్వ‌డం దీనిలో మ‌రో ప్ర‌త్యేక‌త‌. 

ఈమెయిల్ షెడ్యూలింగ్‌
మీరు ఫలానా టైమ్‌కు లేదా ఫ‌లానా రోజుకు ఓ మెయిల్ పంపాలి. కానీ దాన్ని ఇప్పుడే ప్రిపేర్‌చేస్తున్నారు. అలాంట‌ప్పుడు ఈ మెయిల్ షెడ్యూల్ చేసి పెట్టుకోవ‌డానికి కూడా మెయిల్ ట్యాగ్‌లో ఆప్ష‌న్  ఉంది. టైమ్‌, డేట్‌, ఒక‌వేళ వేరే టైమ్‌జోన్‌లో (విదేశాల్లో ) ఉన్న‌వ్య‌క్తి అయితే ఆ టైమ్ జోన్‌కు త‌గ్గ‌ట్లు షెడ్యూల్ చేసి పెట్టుకోవ‌చ్చు

ఆటోమేటిక్ ఈ-మెయిల్ ఫాలో అప్ ప్రాసెస్‌
మీరు పంపిన మెయిల్‌కు అవ‌త‌లి వాళ్లు స్పందించ‌లేదు. వాళ్లు దానికి ఆన్స‌ర్‌గా ప్రీ డిఫైన్ టెక్స్ట్ రిప్ల‌యిగా రావాల‌నుకోండి. అది కూడా మీరే  రిమైండ్‌చేయొచ్చు. వీటిని పింగ్స్ అంటారు. మెయిల్ ట్యాగ్ ఫ్రీ వెర్ష‌న్‌లో ఒక్కో మెయిల్‌కు మూడు పింగ్‌లు సెండ్ చేసుకోవ‌చ్చు. 

డెడికేటెడ్ డాష్‌బోర్డు
మెయిల్ ట్యాగ్‌కు ఓ డెడికేటెడ్ డాష్‌బోర్డు కూడా ఉంది. మీకొచ్చిన మెయిల్స్‌, అందులో రీడ్ చేసిన‌వి, వాటిని ఎన్నిసార్లు చ‌దివారు, ఫాలో అప్ ఈ మెయిల్ స్టేట‌స్‌, అన్ని మెయిల్స్‌కు సంబంధించిన టైమ్‌లైన్ ఈ డాష్ బోర్డులో క‌నిపిస్తాయి.

24/7 ఈ మెయిల్‌, లైవ్‌చాట్ స‌పోర్ట్ కూడా ఉంది. ఫ్రీ వెర్ష‌న్‌లోనే ఇవ‌న్నీ చేసుకోవ‌చ్చు. పెయిడ్ వెర్ష‌న్లో అయితే యాడ్స్ ఉండవు.పింగ్స్ పంప‌డానికి లిమిట్ లేదు. 30 రోజుల కంటే ఎక్కువ డేటా కూడా పొంద‌వ‌చ్చు.

జన రంజకమైన వార్తలు