• తాజా వార్తలు

మీ ఫోన్‌లోకి తొంగిచూసేవారికి నిరాశ మిగిల్చే యాప్

సెల్‌ఫోన్ మ‌న ప‌ర్స‌న‌ల్ వ‌స్తువు. అందులో మ‌న ప‌ర్స‌న‌ల్స్‌ చాలా ఉంటాయి.  ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నెంబ‌ర్లు, మెసేజ్‌లు, ఫోటోలు ఇలా అంద‌రితో పంచుకోలేనివి, పంచుకోకూడ‌నివి చాలా మ‌న ఫోన్‌లో ఉంటాయి. ఇవేకాక ఇప్పుడు బ్యాంకింగ్ యాప్స్‌, వాలెట్స్ లాంటివి వ‌చ్చాక ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్లు కూడా చేస్తుండ‌డం ఆ ర‌కంగానూ మ‌నం ఫోన్ వాడుతున్న‌ప్పుడు ప‌క్క‌వాళ్లు తొంగి చూడ‌డం ఇబ్బందే. ఇలాంటి ఇబ్బందిని తొల‌గించ‌డానికి  ఓ ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది. దాని పేరు Privacy Screen Guard & Filter యాప్‌. 
బ్లాక్‌బెర్రీ ఇన్‌స్పిరేష‌న్‌తో..
బ్లాక్‌బెర్రీ త‌న డివైస్‌ల్లోకి ఎవ‌రూ తొంగిచూడ‌కుండా ప్రైవ‌సీ షేడ్ అనే యాప్‌ను త‌యారుచేసింది. దానిలాగానే ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఈ ప్రైవ‌సీ స్క్రీన్‌గార్డ్ ఫిల్ట‌ర్ యాప్ వ‌చ్చింది. ఇది మీరు టైప్‌చేస్తున్న లేదా చ‌దువుతున్న భాగాన్ని త‌ప్ప మీ ఫోన్‌లో ఉన్న మిగిలిన డిస్‌ప్లేను అంతా బ్ల‌ర్ చేసేస్తుంది. ఆ ప్లేస్ మొత్తంలో ఒక క‌ల‌ర్ టింట్‌లాంటి ప్రైవ‌సీ షేడ్‌తో క‌వ‌ర్ చేసేస్తుంది. దీంతో ఎవ‌రైనా మీ ఫోన్‌లోకి తొంగి చూసినా వాళ్ల‌కు ఏమీ క‌న‌పించ‌దు.
ఎలా వాడుకోవాలి? 
1.ప్లే స్టోర్‌లోకి వెళ్లి Privacy Screen Guard & Filter యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ను లాంచ్ చేసి ప‌ర్మిష‌న్స్ ఇవ్వండి. 
2.వెంట‌నే యాప్ షేడ్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీనిలో ఉండే బార్‌ను డ్రాగ్ చేసి ఫోన్ స్క్రీన్‌లో ఎంత‌వ‌ర‌కు క‌నిపిస్తే స‌రిపోతుందో అంత‌వ‌ర‌కూ ఉంచుకుని మిగిలిన‌దాన్ని క‌వ‌ర్ చేసుకోవ‌చ్చు.
3.మీ ఫోన్ స‌ర్ఫేస్ కల‌ర్‌ను డార్క్‌గా, లైట్‌గా మార్చుకోవ‌డానికి  ఆప్ష‌న్స్ ఉన్నాయి.నైట్ మోడ్ కూడా ఉంది.

జన రంజకమైన వార్తలు