• తాజా వార్తలు
  •  

స్మిన్ క్యూ ఉంటే చాలు.. క్యూలో నిల‌బ‌డాల్సిన పని లేదు

హాస్పిటల్‌కు వెళితే క్యూలో వెయిట్ చేసీచేసీ విసుగొచ్చేస్తుంది. చిన్నా, పెద్దా తేడా లేదు.. వీధి చివ‌ర ఉండే చిన్న క్లినిక్ నుంచి కార్పొరేట్ హాస్పిట‌ల్ వ‌ర‌కు వెళ్లామంటే చాలు.. గంట‌ల త‌రబ‌డి వెయిట్ చేయాల్సిందే. దీనికి ఓ సొల్యూష‌న్ క‌నిపెట్టింది స్మిన్‌క్యూ అనే ఓ స్టార్ట‌ప్ కంపెనీ. స‌చిన్ భ‌రద్వాజ్‌, సంతోష్ నాగరాజ‌న్‌, షెల్డ‌న్ డిసౌజా అనే ముగ్గురు క‌లిసి 17 నెల‌ల క్రితం ఈ స్టార్ట‌ప్‌ను ప్రారంభించారు.  

ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యాప్ .. రియ‌ల్‌టైం అప్‌డేట్స్
స్మిన్‌క్యూ యాప్ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌లతోపాటు డెస్క్‌టాప్‌లోనూ అందుబాటులో ఉంది. దీనికి రెండు ఇంట‌ర్‌ఫేస్‌లు ఉంటాయి. ఒక‌టి డాక్ట‌ర్లు త‌మ టైమ్‌ను షెడ్యూల్ చేసుకోవ‌డానికి, రెండోది పేషంట్లు నోటిఫికేష‌న్లు రిసీవ్ చేసుకోవ‌డానికి, త‌మ అపాయింట్‌మెంట్స్ ప్లాన్ చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.  డాక్ట‌ర్లు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో తెలుసుకుని ఆ టైమ్‌కు అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోవ‌డం, క్రౌడ్ ఎక్కువ ఉంద‌ని గుర్తించి అపాయింట్‌మెంట్ దానికి త‌గ్గ‌ట్లు ప్లాన్ చేసుకోవ‌డం ఈ యాప్ థీమ్‌. సుమారుగా ఎంత టైం ప‌డుతుందో కూడా చూడొచ్చు. అపాయింట్‌మెంట్‌కు సంబంధించి రియ‌ల్‌టైం అప్‌డేట్స్ వస్తుండ‌డంతో బాగా వ‌ర్క‌వుట్ అవుతోంది. ఒక్కో పేషంట్‌కు సుమారు 74 నిముషాల వెయిటింగ్ టైం స్మిన్‌క్యూ వ‌ల్ల సేవ్ అయింది. ఇప్ప‌టివ‌ర‌కు పేషంట్ల వెయిటింగ్ మేం సేవ్ చేసింది లెక్కేస్తే అది దాదాపు 140 సంవ‌త్స‌రాల‌ని నాగ‌రాజ‌న్ చెప్పారు. 
మిగ‌తావాటికీ..
ఫేమ‌స్ రెస్టారెంట్ల‌లో టేబుల్ కోసం, మాల్స్‌, షాపింగ్ కాంప్లెక్స్‌లో పార్కింగ్‌, బిల్లింగ్ కోసం క్యూలు త‌ప్ప‌వు. ఇలాంటి వాట‌న్నింటికీ త్వ‌ర‌లోనే స్కిమ్‌క్యూ స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెస్తామంటున్నారు. స్మిన్‌క్యూ కి ప్ర‌స్తుతం చాలా మంది క‌స్ట‌మ‌ర్లున్నారు. పేషంట్లు, డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర నుంచి స‌బ్‌స్క్రిప్ష‌న్ రూపంలో కొంత ఫీజ్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది 30 లక్ష‌ల వ‌ర‌కు రెవెన్యూ వచ్చింది. వ‌చ్చే సంవ‌త్స‌రం కోటి రూపాయ‌ల రెవెన్యూ టార్గెట్‌. పేషంట్ల‌కే ఎక్కువ ఉప‌యోగ‌ప‌డేది కాబ‌ట్టి డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర నుంచి కాకుండా పేషంట్ల నుంచే తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. 

జన రంజకమైన వార్తలు