• తాజా వార్తలు
  •  

మీ ఫొటోల‌ను పోస్ట‌ర్లుగా మార్చే వెబ్‌సైట్లు ఉన్నాయి.. తెలుసా? 

స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా పిక్సెల్స్ పెరుగుతున్న కొద్దీ క్వాలిటీ ఫొటోస్ వ‌స్తున్నాయి. వాటిని పోస్ట‌ర్‌గా వేయించుకోవ‌డానికి కూడా ఛాన్స్ ఉంది. దీనికోసం మీరేమీ ఎక్స్‌ప‌ర్ట్‌ల ద‌గ్గ‌ర‌కెళ్ల‌క్క‌ర్లేదు. ఆన్‌లైన్‌లో మీ ఫొటోస్‌ను పోస్ట‌రైజ్ చేయ‌డానికి చాలా వెబ్‌సైట్లున్నాయి.  వీటిలో ఫొటోను అప్‌లోడ్ చేసి,  కావాల్సిన టెక్స్ట్‌, బోర్డ‌ర్‌, ఫ్రేమ్‌, బాక్స్ వంటివ‌న్నీ సెట్ చేసుకోవ‌చ్చు. త‌ర్వాత పోస్ట‌రైజేష‌న్ లెవెల్‌ను సెట్ చేస్తే చాలు మీకు కావ‌ల‌సిన రిజ‌ల్ట్ వ‌స్తుంది.  ప్రివ్యూ చూసి న‌చ్చితే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  జేపీజీ, పీఎన్‌జీ, జిఫ్‌, బీఎంపీ ఇలా ఏ ఫార్మాట్‌లో ఉన్న ఫొటోనైనా పోస్ట‌ర్‌గా మార్చుకోవ‌చ్చు. 
PineTools: Posterize Effect Online
పైన్ టూల్స్‌లోని Posterize Effect Online ద్వారా మీ ఫొటోల‌ను పోస్ట‌ర్లుగా మార్చుకోవ‌చ్చు.  మీ ఫొటోను పీసీ నుంచి వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేయాలి. పోస్ట‌రైజేష‌న్ లెవెల్‌ను సెట్ చేసుకోవ‌డానికి రైట్ సైడ్‌లో ఉన్న స్లైడ‌ర్‌ను వాడుకోవ‌చ్చు. ఈ స్లైడ‌ర్‌లో లెవెల్‌ను బ‌ట్టి  క‌ల‌ర్ వేరియేష‌న్స్ వ‌స్తాయి. వాటిని సెట్ చేసుకున్నాక  Posterize ఆప్ష‌న్‌ను క్లిక్ చేస్తే అది మీ ఫొటోకి అప్ల‌యి అవుతుంది. మీ పోస్ట‌ర్‌ను జేపీజీ, పీఎన్‌జీ, వెబ్‌పీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  
ఫ్రీ ఆన్‌లైన్ ఫొటో ఎడిట‌ర్ (FreeOnlinePhotoEditor) 
ఇది కూడా పైన్ టూల్స్‌లాగే ప‌ని చేస్తుంది. పీసీ నుంచి ఫొటోను అప్‌లోడ్ చేయాలి లేదంటే ఫొటో యూఆర్ఎల్ ఎంటర్ చేసి అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు. తర్వాత ఫిల్ట‌ర్స్ మెనూలోకి వెళ్లి పోస్ట‌రైజ్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. పోస్ట‌రైజేష‌న్ ఇంటెన్సిటీని సెట్ చేసుకోవ‌డానికి స్లైడ్ ఉంటుంది. దాన్ని సెట్ చేసి అప్ల‌యి అనే బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే ఫోటో  పోస్ట‌ర్‌గా మారుతుంది. 
ఐఎంజీ ఆన్‌లైన్ (IMGonline)
ఈ వెబ్‌సైట్‌లో ఫొటో అప్‌లోడ్ చేశాక పోస్ట‌రైజ్ లెవెల్‌ను 1 నుంచి 250 వ‌ర‌కు, అవుట్‌పుట్ ఇమేజ్ క్వాలిటీని 1 నుంచి 100 వ‌ర‌కు కావ‌ల్సినంత క్వాలిటీలో సెట్ చేసుకోవ‌చ్చు. పోస్ట‌రైజేష‌న్‌కు ముందు, పోస్ట‌రైజేష‌న్ త‌ర్వాత ఫొటో ఎలా ఉందో కూడా ప్రివ్యూ చూపిస్తుంది.  
పోస్ట‌రైజ‌ర్ (Posterizer)
ఇదికూడా ఐఎంజీ ఆన్‌లైన్ లాగే ప‌నిచేస్తుంది. పోస్ట‌ర్‌లో ఎన్ని క‌ల‌ర్స్ యాడ్ చేయాలో కూడా స్పెసిఫై చేసే ఫీచ‌ర్ ఉంది. 
లూనాపిక్ (LunaPic) 
ఇదికూడా మంచి పోస్ట‌రైజ‌ర్ వెబ్‌సైట్‌. ఇందులో టెక్స్ట్ బాగా  హైలైట్ అవుతుంది. 
 

జన రంజకమైన వార్తలు