• తాజా వార్తలు

మీ కారు మైలేజిని పెంచడానికి 3 ఎఫెక్టివ్ యాప్స్

మీ కారు ఎంత మైలేజి ఇస్తుందంటే ఎవరూ సరిగ్గా చెప్పలేం. వాడుతున్న మోడల్ ను బట్టి అంచనాతో ఎంతో కొంత చెప్తామే తప్ప అంత కచ్చితంగా చెప్పడం  కష్టం. కొద్దిమంది మాత్రమే ఎప్పుడు ఎన్ని లీటర్లు పెట్రోల్ లేదా డీజిల్ పోయించాం... అప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరిగాం అన్నది రికార్డు చేసి మైలేజిని రికార్డు చేస్తారు. అందుకోసం ఒక కాగితంపై కానీ, పుస్తకం కానీ రాసుకుంటారు. కానీ... ఇది అందరికీ సాధ్యం కాదు, అలాగే ఒకవేళ రాసుకున్నా కూడా అన్ని సార్లూ కరెక్టుగా మెంటైన్ చేయలేరు కూడా. ఇలాంటి వారికి ఇప్పుడు టెక్నాలజీ అండగా నిలవనుంది. అవును.. విండోస్ 10పై పనిచేసే మైలేజ్ లాగర్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అవేంటో చూద్దాం..
* ట్రాక్ మై మైలేజి
ఇది విండోస్ 10 ఓఎస్ పై మొబైల్, డెస్కుటాప్ ల్లో పనిచేసే ఉచిత యాప్. ఇందులో డ్రైవరు వివరాలు, వెహికల్ మోడల్, నంబర్ వంటివివరాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఉచిత వెర్షన్లో ఒక డ్రైవర్ లేదా ఒక వెహికల్ కు సంబంధించిన వివరాలు మాత్రమే యాడ్ చేయగలం. పెయిడ్ వెర్షన్ అయితే ఒకటి కంటే ఎక్కువ యాడ్ చేసుకుని ట్రాక్ చేయొచ్చు. ఒకసారి వివరాలు యాడ్ చేశాక.. ఆ డ్రైవర్ లేదా వెహికల్ కు సంబంధించి ట్రాకింగ్ మొదలు పెట్టొచ్చు. అందుకోసం ప్రారంబించిన తేదీ.. అప్పటికి కార్లో ఉన్న ఓడో మీటర్ రీడింగ్ ఎంటర్ చేయాలి. పెట్రోల్ నింపేటప్పు ఆ వివరాలు యాడ్ చేసుకుంటూ మైలేజిని గుర్తించొచ్చు. ఈ వివరాలన్నీ ఎక్సెల్ షీట్లో డెస్కుటాప్ లో చూసుకోవచ్చు కూడా.
* మైలేజి రికార్డర్
ఇది ఒక కేలిక్యులేటర్ లా, కన్వర్టర్ లా పనిచేస్తుంది. ఇందులో దూరం, పోయించిన పెట్రోలు వివరాలు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇది ఎతం మైలేజి ఇస్తుందో చెప్పడమే కాకుండా ఎంత ఖర్చవుతుందో కూడా చెప్తుంది.
* మైలేజి
ఇందులో ప్రతి ఎంట్రీకి ఒక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. అందులో డెస్టినేషన్, పర్పస్, తేదీ, ప్రారంభ రీడింగ్, ముగించిన రీడింగ్ ఎంటర్ చేయాలి. అప్పుడు మైలేజి అదే చూపిస్తుంది. ఈ వివరాలన్నీ సేవ్ చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు