• తాజా వార్తలు

రాజ‌మౌళి సెల్ఫీ, రానా ట్వీట్‌.. ఏఆర్ టెక్నాల‌జీతో ఫ‌స్ట్ మోష‌న్ పోస్ట‌ర్ తెలుగు మూవీలోనే..

 

 సినిమా యాక్ట‌ర్స్‌, క్రికెట‌ర్స్ క‌న‌ప‌డ‌గానే ఒక‌ప్పుడు ఆటోగ్రాఫ్ అడిగేవారు.  ఇప్పుడు ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు.  ఇప్పుడు డైరెక్ట్‌గా సినిమా యాక్ట‌ర్ల‌ను ప‌ల‌క‌రించేందుకు వీలున్న మోష‌న్ పోస్ట‌ర్లు వ‌చ్చేశాయి.  ఇండియాలోనే తొలిసారిగా మ‌న తెలుగు యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి న‌టించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో ఈ మోష‌న్ పోస్ట‌ర్ల‌ను వినియోగించారు.  ఏఆర్ టెక్నాల‌జీతో ఈ స్టాండ్ బై పోస్ట‌ర్లు సినిమా ప్ర‌మోష‌న్‌లో పెద్ద ఎసెట్ అవుతోందంటోంది  సినిమా యూనిట్‌.  ప్రముఖ డైరెక్ట‌ర్  రాజమౌళి ‘నేనే రాజు నేనే మంత్రి’ స్టాండ్‌ బై పోస్టర్‌ దగ్గర నిల్చొని సెల్ఫీ తీసుకొన్నారు. ఆ ఫొటోని రానా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

ఏఆర్ టెక్నాల‌జీతో.. 
అగ్మెంటెడ్‌ రియాల్టీ (ఏఆర్‌) టెక్నాల‌జీతో ‘నేనే రాజు నేనే మంత్రి’  మూవీ ప్ర‌మోష‌న్ చేస్తున్నారు.  ఈ మూవీ పోస్ట‌ర్ల‌లో మోష‌న్ సెన్స‌ర్ కోడ్స్ ఉంటాయి. సెల్‌ఫోన్‌లో  యాప్‌స్టర్  అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్‌ను ఓపెన్ చేసి  ‘నేనే రాజు నేనే మంత్రి’ స్టాండ్‌ బై పోస్టర్‌ దగ్గర ఉంచితే వెంటనే సెల్‌ఫోన్‌లో ఈ మూవీ హీరో హీరోయిన్లు రానా, కాజల్‌ జంట ప్రత్యక్షమై పలకరిస్తారు.  ఆ పోస్టర్‌ పక్కన నుంచుని సెల్ఫీ  తీసుకుంటే  ప్రత్యక్షంగా రానాని క‌లిసి  సెల్ఫీ తీసుకొన్నట్టే ఉంటుంది. ఏఆర్ టెక్నాల‌జీని సినిమా ప్రమోష‌న్‌లో ప్ర‌పంచంలో ఎవ‌రూ వాడ‌లేదు. తొలిసారిగా తామే యూజ్ చేస్తున్నామ‌ని ప్రొడ్యూస‌ర్ సురేష్‌బాబు చెప్పారు.  సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలంటే ఇలాంటి డిఫ‌రెంట్ ప‌బ్లిసిటీ టెక్నిక్స్ త‌ప్ప‌నిస‌రి అన్నారు.  ఈ కోడ్‌ ఉన్న స్టాండ్‌ బై పోస్టర్లను ఏపీ, తెలంగాణ‌,  తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని థియేటర్లలో ఏర్పాటు చేస్తున్నారు. 
 
 

జన రంజకమైన వార్తలు