• తాజా వార్తలు
  •  

 మీ  ఫొటోల‌ను కార్టూన్లుగా మార్చుకోవ‌డానికి ఫ్రీ యాప్స్ ఇవిగో..

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అదో భ‌రోసా.  సమాచార అవసరాలను దాటి మ‌న ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌లా స్మార్ట్‌ఫోన్ మారిపోయింది. బ్యాంకింగ్ నుంచి టికెట్ బుకింగ్ వ‌ర‌కు అన్నింటికీ స్మార్ట్‌ఫోన్ నేనున్నానంటోంది. అంతేనా మీ ప్ర‌తి రోజునూ అందంగా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డానికి స్మార్ట్‌ఫోన్ కెమెరాలు  ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.  సెల్ఫీలు తీసుకుని  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవడం కామన్ అయింది. అయితే సెల్ఫీల కోసం ప్రత్యేకించి కొన్ని కెమెరా యాప్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్స్‌లో ఉన్న ఫిల్టర్లు...మీరు క్లిక్ చేసిన ఫోటోలను అందంగా తీర్చిదిద్దడానికి మీకు సహాయపడతాయి. ఇప్పుడు మీ ఫొటోల‌ను కార్టూన్ క్యారెక్టర్‌లోకి మార్చే యాప్స్ కూడా అందుబాటులోకి వ‌చ్చేశాయి. అలాంటి వాటిలో బెస్ట్‌యాప్స్ మీ కోసం..
1. కార్టూన్ ఆర్ట్ పిక్స్ ఫోటో ఎడిటర్ (Cartoon Art Pics Photo Editor)
ఈ యాప్ బెస్ట్ కార్టూన్ యాప్స్‌లో  ఒకటి. ఈ యాప్ తో  మీ ఫోటోను కార్టూన్, పెయింటింగ్స్‌లోకి మార్చేందుకు కావాల్సిన మోడ్రన్ ఆర్ట్ ఫిల్టర్స్ ఎన్నో ఉన్నాయి.  మీ ఫోటోను కార్టూన్‌లోకి మార్చేందుకు సెల్ఫీ కెమెరాలో ఉన్న  కార్టూన్ ఫిల్టర్స్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో మీ ఫోటోలను కార్టూన్లుగా క్రియేట్ చేయడానికి ఇది బెస్ట్ యాప్ అని చెప్పవచ్చు.
2.  కార్టూన్ ఫోటో ఎడిటర్ (Cartoon Photo Editor)
మీ ఫోటోను కార్టూన్‌లోకి మార్చడానికి మరో బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్ కార్టూన్ ఫోటో ఎడిటర్. స్కెచెస్, కార్టూన్లు, ఆయిల్ పెయింటింగ్, పెన్సిల్ డ్రాయింగ్ ఇలా వీటన్నింటిని అప్లయ్ చేసుకోవడానికి ఎన్నో ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో మీ ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌తో క్రియేట్ చేసుకున్న ఫోటోను నేరుగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.
3.  ఆర్టిస్టా కార్టూన్ అండ్ స్కెచ్ కామ్ (ArtistA Cartoon & Sketch Cam)
మీ ఫోటోను కార్టూన్ క్యారెక్టర్‌లోకి మార్చగలిగే మరొక ఆండ్రాయిడ్ యాప్ ఇది. సెల్ఫీల‌ కోసం ఇందులో మంచి ఆప్షన్ ఉంది. ఫోటో ఎడిటింగ్ కు ఫిల్టర్లను సెలక్ట్ చేసుకోవడం  కోసం మీ సెల్ఫీ కెమెరాకు ఉపయోగపడుతుది. అంతేకాదు ఇందులో  ఫోటోలకు కావాల్సిన ఎన్నో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.  ఈ యాప్ తో మీరు గ్రేట్ ఆర్ట్ వర్క్ క్రియేట్ చేయవచ్చు. ఇలా ఎడిట్ చేసిన ఫోటోలను ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేయవచ్చు.
4. కార్టూన్ ఫేస్ సెల్పీ ఫోటో ఎడిట్  (Cartoon Face-selfie Foto edit )
అద్భుతమైన కార్టూన్ క్యారెక్టర్లను క్రియేట్ చేయడానికి మీరు ఉపయోగించే ఫిల్టర్లలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్స్‌, బ్యూటీ మేకప్ ఎఫెక్ట్స్ లిస్టు వంటివి ఎన్నో ఫిల్టర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.
5. కార్టూన్ యువర్ సెల్ఫ్ (Cartoon Yourself)
కొన్ని నిమిషాల్లోనే మీ ఫోటోలను కార్టూన్‌గా క్రియేట్ చేసుకోవ‌డానికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరు చేయాల్సిందల్లా యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, లాంచ్ ఫోటోను సెలక్ట్ చేసుకోవడమే. యాప్ లో ఇన్ బిల్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేస్తుంది. మీరు క్రియేట్ చేసుకున్న్ ఫోటోను డౌన్‌లోడ్ చేసుకుని సోష‌ల్ మీడియాలోగానీ, ప‌ర్స‌న‌ల్‌గా ఫ్రెండ్స్‌కు కానీ  షేర్ చ‌చేసుకోవచ్చు. jpg,png,gif ఇమేజ్ ఫార్మాట్లకు కూడా సపోర్టు చేస్తుంది.
6. కార్టూన్ స్కెచ్ (Cartoon Sketch)
ఈ యాప్ ఎఫెక్ట్స్, ఫ్రేమ్స్, ఫిల్టర్లతో దీన్నికార్టూన్‌గా మార్చ‌డం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు  అందంగా, ప్రకాశవంతంగా కనిపించడానికి ఇమేజ్‌ను ఎడిట్ కూడా చేసుకోవచ్చు.  ఎమోజీలతో  ఫన్నీ లుక్ కూడా తేవ‌చ్చు. కావాలంటే టెక్ట్స్ కూడా రాసుకోవచ్చు. ఫోటోను కార్టూన్ లేదా స్కెచ్‌లోకి మార్చాక సేవ్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు.
7. ఫాటిఫై  (Fatify)
ఈ యాప్‌తో మీ ఫోటోను కార్టూన్ మాదిరిగా కనిపించేలా చేయవచ్చు. అంతేకాదు ఫోటోలో మీ ముఖంగా లావుగా కనిపించేలా ఎడిట్ చేయవచ్చు. ముఖం మాత్రమే కాదు...శరీరాన్ని మొత్తం  లావుగా కనిపించేలా క్రియేట్ చేయవచ్చు.  
8.  మూమెంట్ క్యామ్ కార్టూన్స్‌, స్టిక్క‌ర్స్ (MomentCam Cartoons & Stickers)
మీ ఫోటోల నుంచి ఫన్నీ కార్టూన్లను, స్టిక్కర్లను క్రియేట్ చేయడానికి ఉపయోగపడే మరొక యాప్. ఫన్నీక్యారెక్టర్, ఎమోటికాన్లను ఆప్షన్‌గా ఎంచుకోవాలి. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ను సెలక్ట్ చేసుకున్నాక మీ ఫోటోను పూర్తిగా కార్టూన్ గా క్రియేట్ చేయవచ్చు.కొన్ని ఫన్నీ స్టిక్కర్లను కూడా యాడ్ చేయవచ్చు. ఫోటోలో ముఖానికి అద్దాలు, గడ్డం, మీసాలు, జుట్టు లాంటివి యాడ్ చేసి ఫన్నీగా మార్చవచ్చు.

జన రంజకమైన వార్తలు