• తాజా వార్తలు

మీ కార్డుల యూసేజ్‌లో మాగ్జిమ‌మ్ లాభం పొంద‌డానికి కార్డియ‌ల్ యాప్ ఇదే..

పేమెంట్స్ చేయాలంటే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ చేసేప‌ని కార్డు పేమెంట్. ప్ర‌భుత్వం కూడా దీన్ని ప్రోత్స‌హిస్తుండ‌డంతో చాలామంది మ‌నీ ట్రాన్సాక్ష‌న్లే మ‌రిచిపోయారు. అంతా కార్డుల‌తోనే లావాదేవీలు సాగిస్తున్నారు. ఎక్కువ‌మంది ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు చేస్తున్నారు. దీనికి కార‌ణం కార్డుల‌ను ఉప‌యోగిస్తే కొన్ని లాభాలు ఉండ‌డ‌మే. ఎంతోకొంత క్యాష్‌బ్యాక్ రావ‌డ‌మే. ఐతే ఇప్పుడు ప‌రిస్థితి మారింది. కార్డులను ఉప‌యోగిస్తున్నా.. ఛార్జీల మోత మాత్రం త‌ప్ప‌ట్లేదు. జీఎస్‌టీ భారం భ‌రించ‌క త‌ప్ప‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో కార్డుల యూసేజ్‌లు మాగ్జిమ‌మ్ లాభం పొందాలంటే ఏం చేయాలి?.. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఒక యాప్ వ‌చ్చింది దాని పేరే కార్డియ‌ల్‌.

ఏంటి కార్డియ‌ల్‌?
కార్డియ‌ల్ యాప్ ప్ర‌త్యేక‌త ఏంటంటే మీ క్రెడిట్‌, డెబిట్ కార్డులు, వాలెట్‌ల‌పై ఉన్న ఆఫ‌ర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించి మ‌న‌ల్ని అలెర్ట్ చేస్తుంది.  మీకు మాగ్జిమ‌మ్ సేవింగ్స్ ఉండాలంటే ఏ కార్డును వాడాలి అనే విష‌యంపై కార్డియ‌ల్ మ‌న‌కో క్లారిటీ ఇస్తుంది. ఈ యాప్ వాడ‌డం కూడా టోట‌ల్‌గా సెక్యూర్‌.  ఈ యాప్ మీ వాలెట్ లేదా కార్డుల వివ‌రాలు అడ‌గ‌దు. కార్డు పేరు లేదా వాలెట్ పేరు, మీ బ్యాంకు పేరు ఇస్తే చాలు మీకు సంబంధించిన ఆఫ‌ర్ల వివ‌రాలు తెలిసిపోతాయి. 

లాభాలు ఏమున్నాయంటే...
మీ కార్డుల‌కు సంబంధించి ఏ ఆఫ‌ర్లు ఉన్నాయో వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు.

అన్ని కార్డులు ఆఫ‌ర్లు ఇస్తాయి. అయితే వీటిలో ఏది ఉత్త‌మైందో తెలుసుకోడానికి కూడా కార్డియ‌ల్ సాయం చేస్తుంది. అంటే మీరు ఏ కార్డు స్పైప్ చేయాలో కూడా చెబుతుంది.

మీకు అందుబాటులో ఉండే ఏ ఆఫ‌ర్‌ను మీరు మిస్ కారు. దీని వ‌ల్ల మీకు లాభం చేకూరుతుంది. 

కార్డియ‌ల్‌ను ఉప‌యోగించ‌డం ఎంతో సుర‌క్షితం. ఎలాంటి కార్డు నంబ‌ర్లు ఇవ్వ‌క్క‌ర్లేదు. కార్డు పేరు, ఇష్యూయింగ్ బ్యాంకు వివ‌రాలు ఇస్తే చాలు. 

మీ లొకేష‌న్ వివ‌రాల‌ను బ‌ట్టి, కార్డు వివ‌రాల‌ను బట్టి వెంట‌నే మీకు సంబంధించిన ఆఫ‌ర్ల‌ను తెలియ‌జేస్తుంది.

మీ ఫేవ‌రేట్ ఆఫ‌ర్ల‌ను పిన్ చేసి మీ స్నేహితుల‌తో కూడా షేర్ చేసుకోవ‌చ్చు
 

జన రంజకమైన వార్తలు