• తాజా వార్తలు
  •  

అప‌రిచితుల‌తో చాట్ చేయ‌డానికి సేఫ్ యాప్స్ ఇవే

ఆన్‌లైన్‌లో చాటింగ్‌కు ఎన్నో వంద‌ల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో కొన్నిమాత్ర‌మే ద బెస్ట్‌. వాటిలో కొన్నింటితో ఇబ్బందులు కూడా త‌లెత్తుతాయి. ఎందుకంటే మ‌న‌కు తెలియ‌నివాళ్ల‌తో చాటింగ్ చేసేట‌ప్పుడు అదెంత సేఫ్ అనేదో తెలియ‌దు. మ‌రి అప‌రిచితుల‌తో చాట్ చేయ‌డానికి అందుబాటులో ఉన్న మంచి యాప్స్ ఏమిటో చూద్దామా...

టిండ‌ర్‌
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్న డేటింగ్ యాప్‌ల‌లో టిండ‌ర్ ఒక‌టి. అప‌రిచితుల‌తో చాట్ చేయ‌డానికి దీనికి మించిన యాప్ మ‌రొక‌టి లేదు,  సుల‌భ‌మైన దీని ఇంట‌ర్‌ఫేస్ వ‌ల్ల ఎక్కువ‌మందిని ఆక‌ర్షిస్తుంది ఈ యాప్‌. కాక‌పోతే దీని వ‌ల్ల ఉన్న ప్రాబ్ల‌మ్ ఏమిటంటే స్పామ‌ర్స్ ఎక్కువ‌గా ఈ యాప్‌ను టార్గెట్ చేశారు. కానీ ఇప్ప‌టికే వేలాది మంది ఈ యాప్‌ను  వాడుతున్నారు. మీతో అవ‌త‌లి వ్య‌క్తి చాట్ చేయాలంటే రైడ్ సైడ్‌కు స్వైప్ చేయాలి. అవ‌త‌లి వ్య‌క్తి కూడా అలాగే చేయాలి. ఇది ప‌ర‌స్ప‌రం ఇంట్రెస్ట్ ఉంటేనే చాట్ కుదురుతుంది.

మొకొ
ర‌హ‌స్యంగా చాటింగ్ చేయాల‌నుకునే వాళ్ల‌కు మొకొ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. చాట్ రూమ్స్‌లో ఈ యాప్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు.  సెక్యూర్ చాటింగ్ కావాలంటే ముందుగా మీరు ఈ యాప్‌ను సైన్ ఇన్ చేయాలి. ఇప్ప‌టికే గూగుల్ ప్లే స్టోర్‌లో 10 మిలియ‌న్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్నారు. ఈ యాప్‌లో ప్ర‌త్యేక‌త ఏంటంటే ప్రైవేటుగా చాట్ చేయ‌డం మాత్ర‌మే కాదు గ్రూప్‌లో కూడా చాట్ చేసుకోవ‌చ్చు. టిండ‌ర్ మాదిరిగానే  మీ లొకేష‌న్‌ను యాడ్ చేసి మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న పీపుల్ కోసం సెర్చ్ చేయ‌చ్చు.

బాడూ
ఈ యాప్ 190 దేశాల్లో 47 భాష‌ల్లో అందుబాటులో ఉందంటేనే దీని పాపుల‌రిటీ అర్ధం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్న వాళ్ల సంఖ్య 350 మిలియ‌న్ల‌కు చేరువైంది. దీనిలో ఉండే యూజ‌ర్ ఫ్రెండ్లీ ఇంట‌ర్‌ఫేస్ వ‌ల్ల ఎక్కువ‌మంది ఆక‌ర్షితులు అవుతున్నారు. దీన్నిసింగిల్ సైన్ అప్  ద్వారా వాడుకోవ‌చ్చు.  డేట్ లేదా చాట్ చేసుకునే అవ‌కాశం దీనిలో ఉంది. 

క్విప్‌
అందుబాటులో ఉన్న డేటింగ్ యాప్‌ల‌లో ఇదో ఉత్త‌మ‌మైంది. సైన్ అప్ చేసుకున్న త‌ర్వాత నేరుగా అప‌రిచితుల‌తో మీరు మాట్లాడే అవ‌కాశం ఉంది.అంతేకాదు మ‌న‌కు సంబంధించిన వాళ్లు ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో తెలుసుకునే అవ‌కాశం కూడా దీనిలో ఉంది. మీ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవ‌డం ద్వారా మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న స్నేహితుల‌ను క‌నుగొనొచ్చు.

అజ‌ర్‌
అప‌రిచితుల‌తో చాటింగ్‌, వీడియో కాలింగ్ లాంటివి చేసుకోవ‌డానికి అజ‌ర్ యాప్ మంచి ఆప్ష‌న్ ప్ర‌స్తుతం ఈ యాప్ 190 దేశాల్లో అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను 100 మిలియ‌న్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ముఖ్యంగా వీడియో చాట్ విష‌యంలో ఇది మంచి ప్ర‌త్యామ్నాయం.  టెక్ట్ మెసేజ్‌లకు కూడా ఇది మంచి యాప్‌. ఫేస్‌బుక్‌లా దీనిలో కూడా స్నేహితుల జాబితా త‌యారు చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు