• తాజా వార్తలు

మీ ఫోన్ కాల్స్ షెడ్యూల్ చేసుకోవ‌డానికి  స్పెష‌ల్ యాప్స్‌ మీకోసం..

పొద్దున్నే ఫ్రెండ్‌కో, రిలేటివ్స్‌కో బ‌ర్త్‌డే విషెసో, పెళ్లి రోజు శుభాకాంక్ష‌లో చెప్పాలి..  అనుకుని మ‌రిచిపోయారా? ఏ సాయంత్ర‌మో ఛాయ్ తాగుతుంటే గుర్తొచ్చి నాలుక్క‌రుచుకుంటున్నారా? అలాంటి ఇబ్బంది త‌లెత్త‌కుండా ఫ‌లానా డేట్‌కు, ఫ‌లానా టైమ్‌కు ఆటోమేటిగ్గా మ‌నం చెప్పిన ప‌ర్స‌న్‌కు కాల్‌చేసేలా కాల్‌ను షెడ్యూల్ చేసుకోవ‌చ్చు. దీనికి చాలా యాప్స్ కూడా ఉన్నాయి. ఓ లుక్కేద్దాం ప‌దండి.
కొన్ని కాల్ షెడ్యూలింగ్ యాప్స్‌లో గంట‌లు, రోజులు, నెల‌లు, సంవ‌త్స‌రాల లెక్క‌న కూడా కాల్‌ను షెడ్యూల్ చేసుకోవ‌చ్చు.  కొన్నియాప్స్‌లో మ‌న కాల్ షెడ్యూల్ చేసిన టైమ్‌కు అల‌ర్ట్‌చేసేలా అలార‌మ్ పెట్టుకోవ‌చ్చు. అదే టైమ్‌కు వెళ్లేలా కావాలంటే ఎస్ఎంఎస్‌ను షెడ్యూల్ చేసుకోవ‌చ్చు.
ఆటో కాల్ షెడ్యూల‌ర్ (Auto Call Scheduler)
ఆండ్రాయిడ్ కాల్ షెడ్యూలింగ్ యాప్స్‌లో ది బెస్ట్ యాప్ ఇది. 
* యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. 
* ఓపెన్‌ చేసి “+”  బ‌ట‌న్‌ను టాప్ చేసి ఫోన్ కాల్ షెడ్యూల్ చేసుకోవ‌చ్చు.
* మీ ఫోన్ నెంబ‌ర్ ఎంటర్ చేసి డేట్‌, టైమ్ సెట్ చేసుకుని నోట్ యాడ్ చేసుకోవాలి.
*కావాలంటే ఆ టైమ్‌కు మిమ్మ‌ల్ని అల‌ర్ట్ చేయ‌డానికి అలారం కూడా సెట్ చేసుకోవ‌చ్చు. నిముషం, గంట‌, రోజు, వారం ప్ర‌కారం కూడా కాల్ షెడ్యూల్ చేసుకోవ‌చ్చు.
* మీరు కాల్ షెడ్యూల్ చేసుకున్నాక ఆ టాస్క్‌ను సేవ్ చేసుకోవాలి.
* షెడ్యూల్ చేసుకున్న టైమ్‌కు మీ ఫోన్ స్క్రీన్ మీద పాప్ అప్ మెసేజ్ వ‌స్తుంది. కాల్ చేయాలంటే చేయొచ్చు. కావాలంటే క్యాన్సిల్ చేసుకోవ‌చ్చు.
* ఎన్నికాల్స్ అయినా షెడ్యూల్ చేసుకోవ‌చ్చు. లిమిట్ ఏమీ లేదు.
షెడ్యూల్ ఫోన్ కాల్స్ (Schedule Phone Calls) 
ఆండ్రాయిడ్ కాల్ షెడ్యూలింగ్‌యాప్స్‌లో మ‌రో మంచి యాప్ షెడ్యూల్ ఫోన్ కాల్స్ 
* యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. 
* ఓపెన్‌ చేసి “+”  బ‌ట‌న్‌ను టాప్ చేసి ఫోన్ కాల్ షెడ్యూల్ చేసుకోవ‌చ్చు.
* మీ ఫోన్ నెంబ‌ర్ ఎంటర్ చేసి డేట్‌, టైమ్ సెట్ చేసుకుని నోట్ యాడ్ చేసుకోవాలి.
*కావాలంటే ఆ టైమ్‌కు మిమ్మ‌ల్ని అల‌ర్ట్ చేయ‌డానికి అలారం కూడా సెట్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ ఐకాన్‌ను టాప్ చేస్తే అలారం, వాల్యూమ్‌, రింగ్‌టోన్ వంటివి క‌నిపిస్తాయి. మీకు కావాల్సిన అల‌ర్ట్‌ను సెట్ చేసుకోవ‌చ్చు.                   

*ఇవ‌న్నీ ఓకే అయ్యాక టాప్‌లో ఉన్న “Tick”   ఐకాన్‌ను టాప్ చేస్తే మీ కాల్ షెడ్యూల్ అవుతుంది.
* షెడ్యూల్ చేసుకున్న టైమ్‌కు మీ ఫోన్ స్క్రీన్ మీద పాప్ అప్ మెసేజ్ వ‌స్తుంది. కాల్ చేయాలంటే చేయొచ్చు.  snooze  చేయొచ్చు. 
 కావాలంటే క్యాన్సిల్ చేసుకోవ‌చ్చు.
* ఎన్నికాల్స్ అయినా షెడ్యూల్ చేసుకోవ‌చ్చు. లిమిట్ ఏమీ లేదు.
ఈ రెండింటితోపాటు SKEdit Scheduling, Call Planner, Auto Redial, Zoho CRM యాప్స్ కూడా కాల్ షెడ్యూలింగ్‌కు బాగా ఉప‌యోగ‌ప‌డతాయి.SMS and Calls Scheduler Free యాప్‌తో అయితే ఫోన్ కాల్స్‌తోపాటు ఎస్ఎంఎస్‌లు కూడా షెడ్యూల్ చేసుకోవ‌చ్చు.
 

జన రంజకమైన వార్తలు