• తాజా వార్తలు
  •  

మన ట్రాఫిక్ కష్టాలను తగ్గించగల బెస్ట్ యాప్స్ మీకోసం

ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల‌లో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే యాప్‌లు చాలానే ఉంటాయి. అయితే భార‌త్ లాంటి దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ట్రాఫిక్ చాలా కామ‌న్‌.  చిన్న చిన్న గ‌ల్లీల్లో సైతం ట్రాఫిక్ విప‌రీతంగా ఉంటుంది. దీని వ‌ల్ల మీకు చాలా స‌మ‌యం వృథా అవుతుంది. ఈ ట్రాఫిక్‌ను త‌ప్పించుకోవాలంటే చాలా క‌ష్టం. అయితే కొన్ని యాప్‌ల ద్వారా మ‌నం ఈ ట్రాఫిక్ నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. మ‌రి ఆ యాప్‌లు ఏంటో చూద్దామా..

గూగుల్ మ్యాప్స్‌
గూగుల్ మ్యాప్స్‌.. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల‌లో ల‌భ్య‌మ‌య్యే బెస్ట్ యాప్‌గా చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా ఈ గూగుల్ ప‌వ‌ర్డ్ అప్లికేష‌న్‌ను ఉచితంగా మీ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఉప‌యోగం ఏంటంటే రియ‌ల్ టైమ్‌లో అప్‌డేట్ కావ‌డం. ట్రాఫిక్ గురించి అప్ప‌టిక‌ప్పుడు మీకు వివ‌రాలు అందిస్తుంది ఈ యాప్‌. మీరు ట్రావెల‌ర్ అయితే మీకెంతో ఉప‌యోగ‌మిది. 

మ్యాప్స్‌.మి
మీకు గూగుల్ మ్యాప్స్ వాడ‌డం ఇష్టం లేక‌పోతే మ‌రో నేవిగేష‌న్ యాప్ మ్యాప్స్‌.మిని ట్ర‌య్ చేయ‌చ్చు.  దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  దీన్ని ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. ప్ర‌స్తుతం ట్రాఫిక్ ప‌రిస్థితి గురించి పూర్తి వివ‌రాలు అందించ‌డం ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. దీన్ని వోఎస్ఎం లేదా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ కంట్రిబ్యూట‌ర్లు అప్‌డేట్ చేస్తారు. గూగుల్ మ్యాప్స్ మాత్ర‌మే కాదు హోట‌ల్స్‌, ఏటీఎం, బ్యాంక్‌, ప‌బ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్ మొద‌లైన వాటిని కూడా క‌నుక్కునే అవ‌కాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ 4.0.3 వెర్స‌న్ ద్వారా ల‌భిస్తుంది. లేదా ఐవోఎస్ 9.0 లేట‌ర్ వెర్ష‌న్ ద్వారా వాడుకోవ‌చ్చు.

ఆఫ్ లైన్ మ్యాప్స్‌, నేవిగేష‌న్‌
ఆఫ్‌లైన్ మ్యాప్స్‌, నేవిగేష‌న్ అనేది ఫ్రీ ఆండ్రాయిడ్ యాప్స్‌. రియ‌ల్ టైమ్‌లో ట్రాఫిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ అందించ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల మ‌నం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోకుండా స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. దీని యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ చాలా బాగుంది. అన్ని దేశాల ఆఫ్‌లైన్ మ్యాప్‌లు,  ఫ్రీ మ్యాప్ అప్‌డేట్‌, వాయిస్ గైడ్ జీపీఎస్ నేవిగేష‌న్‌, రియ‌ల్ టైమ్ రూట్ షేరింగ్, పెడ‌స్ట్రియ‌న్ జీపీఎస్ నేవిగేష‌న్ లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి. 

యెండెక్స్ నేవిగేట‌ర్‌
యెండెక్స్ నేవిగేట‌ర్ మ‌రో ఉచిత ట్రాఫిక్ యాప్‌. జీపీఎస్ నేవిగేస‌న్ యాప్ ఇది. పార్కింగ్ స్పాట్ కోసం ఇది ఎక్కువ‌మంది ఉప‌యోగించే యాప్‌. దీన్ని నేవిగేట‌ర్‌గా ఉప‌యోగిస్తారు. దీనిలో రియ‌ల్ టైమ్ జీపీఎస్ రూటింగ్ లాంటి ఫంక్ష‌న్లు ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ మాదిరిగానే లోక‌ల్ బిజినెస్‌, హోట‌ల్స్ షాప్స్ వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు