• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ లో బెస్ట్ ఉచిత ఫోటో ఎడిటింగ్ యాప్స్ మీకోసం

ప్రస్తుత స్మార్ట్ యుగం లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కడూ కెమెరామన్ అవతారం ఎత్తుతున్నాడు. కంపెనీలు కూడా కేవలం కెమెరా ప్రియుల కోసమే అన్నట్లు హై రిసోల్యూషన్ కెమెరా లతో కూడిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యం లో సహజం గానే వందల కొద్దీ ఫోటో ఎడిటింగ్ యాప్ లో ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లలో పుట్టుకొచ్చాయి. స్మార్ట్ ఫోన్ తో ఫోటో తీయడం దానిని ఫోటో ఎడిటింగ్ యాప్ లో ఎడిట్ చేసుకోవడం సాధారణ విషయం అయిపొయింది. ప్లే స్టోర్ లో ఉన్న ఇన్ని ఫోటో ఎడిటింగ్ యాప్ లలో అత్యుత్తమమైన ఉచిత యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం.

ఇన్ స్టా గ్రామ్

ఫోటోలు తీసి ఎడిట్ చేసి వాటిని ఇన్ స్టా గ్రాం లో పోస్ట్ చేసే వారికోసమే ఈ యాప్. ఫోటో లు తీసి వాటిని ఎడిట్ చేసి తిరిగి ఇన్ స్టా గ్రం లో పోస్ట్ చేసే బదులు అన్నీ ఒకే చోట చేయవచ్చు కదా అనే ఆలోచనతో ప్రముఖ మెసెంజర్ యాప్ అయిన ఇన్ స్టా గ్రామ్ దాని యొక్క యాప్ కు కొన్ని ఎడిటింగ్ టూల్స్ ను యాడ్ చేసింది. ఇందులో అనేక రకాల ఫీచర్ లు ఉంటాయి. స్యాచురేషన్ అడ్జస్ట్ చేసుకోవడం, షార్ప్ నెస్, కాంట్రాస్ట్ లాంటి ఎన్నో ఫీచర్ లు ఇందులో ఉంటాయి. చూడడానికి ఇందులో ఉండే ఫీచర్ లు చాలా సింపుల్ గా ఉంటాయి.

స్నాప్ సీడ్

ఇది గూగుల్ కి చెందిన యాప్. ఈ స్నాప్ సీడ్ అనే ఫోటో ఎడిటింగ్ యాప్ JPG మరియు RAW ఫార్మాట్ లో ఉండే ఇమేజ్ లను సపోర్ట్ చేస్తుంది.DSLR కెమెరా తో షూట్ చేసిన ఫోటో లను కూడా ఈ యాప్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. చూడడానికి సింపుల్ గా ఉన్నా ఇందులో అనేక అద్భుతమైన ఎడిటింగ్ ఫీచర్ లు ఉంటాయి. ఇమేజ్ పై ఎనిమిది కంట్రోల్ పాయింట్స్ సెట్ చేసుకుని ప్రతీ పాయింట్ పై కూడా ఎన్ హాన్స్ మెంట్ చేసుకునే చక్కటి ఫీచర్ ఒకటి ఇందులో ఉంటుంది.

Vsco

ఐ ఫోన్ మరియు ఆండ్రాయిడ్ రెండింటికీ ఒక చక్కటి ఫోటో ఎడిటింగ్ యాప్ గా దీనిని చెప్పుకోవచ్చు. ఇన్ స్టా గ్రం లో ఉండే ఎడిటింగ్ ఫీచర్ లన్నీ దాదాపుగా ఇందులో కూడా ఉంటాయి. ఇన్ స్టా గ్రం లో ఉండే ఫీచర్ ల కంటే ఇందులో ఉండే ఫిల్టర్ లే మనలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.

Pixlr

బేసిక్ ఫోటో ఎడిటింగ్ కు దీనిని ఒక చక్కటి యాప్ గా చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే చక్కటి ఇంటర్ ఫేస్ ఎఫెక్ట్ లనూ,ఫిల్టర్ లనూ అప్లై చేయడానికి అనువుగా ఉంటుంది. ఇమేజ్ లోని ఏ పార్ట్ పై అయినా బ్లర్ చేయడానికి Pixelate  అనే ఒక చక్కటి టూల్ ఇందులో ఉంటుంది. ఈ యాప్ మరింత యాక్సేసబుల్ గా ఉండడానికి ఇందులో ఉండే పదాలు కూడా అనువుగా ఉంటాయి.

Aviary

ఇది ఒక చక్కటి యూజర్ ఇంటర్ ఫేస్ ను కలిగిఉంటుంది. ఇమేజ్ లకు ఫ్రేమ్ లను మరియు స్టిక్కర్ లను యాడ్ చేసుకునే సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ఈ యాప్ కు దీని ఇంటర్ ఫేస్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే ఎన్ హాన్స్ ఫీచర్ ద్వారా ఒక్క ట్యాప్ లోనే ఇమేజ్ కు కలర్ కరెక్షన్,బేసిక్ బ్రైట్ నెస్ ,సాచురేషణన్ అడ్జస్ట్ మెంట్ లను యాడ్ చేసుకోవచ్చు.పిక్చర్ పై సులభంగా డూడుల్ చేయవచ్చు.

 లెన్స్ డిస్టార్షన్స్

ఈ యాప్ ద్వారా కొన్ని అద్భుతమైన ఎఫెక్ట్ లను మీ ఫోటో కు యాడ్ చేసుకోవచ్చు. లైట్ సోర్సు, ఫాగ్,వర్షం లాంటి ఎఫెక్ట్ లను ఈ యాప్ ద్వారా మీ ఫోటో కు యాడ్ చేసుకోవచ్చు. ఇవి చాలా సహజంగా ఉంటాయి. ఈ ఎఫెక్ట్ లకు లేయర్ లను కూడా యాడ్ చేసుకోవచ్చు. డి ఉచిత యాప్. కానీ ప్రీమియం ఎఫెక్ట్ లు కావలి అనుకుంటే నెలవారీ సబ్ స్క్రిప్షన్ చెల్లించాలి.

APUS కెమెరా 

సాధారణంగా ఫోటో యాప్ లను ఎక్కువగా ఉపయోగించే వారికోసం ఈ యాప్ డిజైన్ చేయబడింది. కొలాగ్,మాక్ అప్, ఫిల్టర్ లు లాంటి టూల్స్ ఇందులో ఉంటాయి. ఇమేజ్ పై క్లిక్ చేస్తే మన యొక్క వయసు. లింగం కూడా చెప్పే ఫన్ టూల్ ఒకటి ఇందులో ఉంది.

జన రంజకమైన వార్తలు