• తాజా వార్తలు

మీ ఫొటోల‌కి వాట‌ర్‌క‌ల‌ర్స్‌, స్కెచెస్ యాడ్ చేసే ప‌ర్‌ఫెక్ట్ యాప్‌.. పోర్ట్రా

స్మార్ట్‌ఫోన్ వ‌చ్చాక అంద‌రూ   ఫొటోలు తీయ‌డం, సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం కామ‌న్ అయిపోయింది. కొంత మంది తాము తీసిన ఫొటోల‌కు కాస్త క్వాలిటీ లుక్ ఇవ్వ‌డానికి ప్రిస్మా, ఫేస్‌యాప్‌లాంటి యాప్స్‌ను వాడుతున్నారు.  ఇప్పుడు  ఈ లిస్ట్‌లోకి పోర్ట్రా అనే కొత్త యాప్ వ‌చ్చి చేరింది.  మీ ఫొటోల‌కు వాట‌ర్ క‌ల‌ర్స్‌, స్కెచెస్ ప‌ర్‌ఫెక్ట్‌గా యాడ్ చేయ‌డం దీని స్పెషాలిటీ.  
ఒరిజిన‌ల్ క్వాలిటీ చెడిపోదు
పేరులో ఉన్న‌ట్లే ఈ యాప్ పోర్ట్ర‌యిట్ ఇమేజెస్‌కు ఫిల్ట‌ర్స్ యాడ్ చేయ‌డానికే మెయిన్‌గా డిజైన్ చేయ‌బ‌డింది. ర‌క‌రకాల క‌ల‌ర్స్‌ను మిక్స్ చేసి వాట‌ర్ క‌ల‌ర్స్‌, స్కెచెస్‌, ఆయిల్ పెయింటింగ్స్‌లో వైబ్రంట్ క‌ల‌ర్స్‌ను యూజ‌ర్స్‌కు అందుబాటులో పెట్టింది. వీటిని మీరు తీసిన ఫొటోకు యాడ్ చేస్తే ప‌ర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ అవుతాయి. సాధార‌ణంగా ఇలాంటి ఫొటో ఫిల్ట‌ర్లు యాడ్ చేసిన‌ప్పుడు ఒరిజిన‌ల్ షాట్‌లోని  డిటెయిల్స్ (ఫొటో డెప్త్‌) దెబ్బ‌తింటుంది. పోర్ట్రాలో ఆ స‌మ‌స్యే లేదు.  మీ ఇమేజ్ డిటెయిల్స్ అలాగే ఉంటాయి.  
19 ఫిల్ట‌ర్లు
ఆండ్రాయిడ్‌,  ఐవోఎస్‌ల్లో ఈ యాప్ ఫ్రీగా ల‌భిస్తుంది.  మీరు యాప్ ఓపెన్ చేసి పిక్చ‌ర్ అప్‌లోడ్ చేయ‌గానే ఆ ఫొటో లాండ్ స్కేప్ మోడ్‌లో ఉంటే పోర్ట్ర‌యిట్ సెక్ష‌న్‌గా క్రాప్ చేయాలా అని అడుగుతుంది. ప్ర‌స్తుతానికి ఇందులో 19 ఫిల్ట‌ర్లున్నాయి.కొన్ని బాగున్నా సెపియా వంటివి మ‌రీ ఎగ్రెసివ్ కాంట్రాస్ట్‌తో కనిపిస్తున్నాయి. వీటిని అప్‌డేట్ చేయాల్సి ఉంది. మొత్తంగా చూస్తే మీ ఫొటోల‌కు కొత్త లుక్ ఇవ్వాలంటే పోర్ట్రా యాప్‌ను ఓసారి ట్రై చూసి చూడొచ్చు. న‌చ్చితే ఫిల్ట‌ర్ అప్లయి చేసిన ఇమేజ్‌ల‌ను హై రిజ‌ల్యూష‌న్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు