• తాజా వార్తలు

ఫోన్ కొనేవారికి ఫోన్ కండిషన్ చెక్ చేసి,క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చే యాప్- TESTM

చాలామంది కొత్త ఫోన్లు కొన‌డం క‌న్నా పాత ఫోన్లు కొన‌డంపైనే ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. అన్ని ఫీచ‌ర్లు ఉండి.. త‌క్కువ ధ‌ర‌కు ఫోన్ వ‌స్తే చాలు అని అనుకుంటారు. జ‌స్ట్ ఆ ఫోన్‌ను పై పైన చూసి ఒకే చెప్పేసి డ‌బ్బులు ఇచ్చేసి ఫోన్ తెచ్చుకుంటారు. ఐతే ఆ ఫోన్ ప‌ని చేసేది కొన్ని రోజులు మాత్ర‌మే. ఆ త‌ర్వాత ఫోన్ పాడైపోయింద‌ని బాధ‌ప‌డినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ట‌చ్ స‌రిగా ప‌ని చేయ‌ని ఫోన్ల‌ను, హ్యాంగ్ అయ్యే ఫోన్ల‌ను కొంత‌మంది మ‌న‌కు అమ్మేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ విషయం తెలియ‌క కొనేసిన త‌ర్వాత బాధ‌ప‌డుతుంటారు చాలామంది. అందుకే టెస్ట్  ఎం అనే యాప్ మీరు  సాయం చేస్తుంది. మ‌రి ఈ యాప్‌ను ఉప‌యోగించ‌డం ఎలా?

ఏ ప్రాబ్లమ్ అయినా ప‌ట్టేస్తుంది
ముందుగా టెస్ట్ ఎం అనే యాప్‌ను ముందుంగా మీరు కొనబోయే ఫోన్లో డౌన్‌లోడ్ చేయాలి. దాన్నిఇన్‌స్టాల్ చేయాలి. దీనిలోకి వెళ్లిన త‌ర్వాత మీకు చాలా ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వాట‌న్నిటిలో కొన్నిటికి ప‌ర్మిష‌న్లు ఇవ్వాలి. ముందుగా డిస్‌ప్లే గురించి టెస్టు చేయాలి.  పిక్స‌ల్ టెస్ట్ అని ఉంటుంది. దాన్ని స్క్రీన్ మీద స్క్రాచ్ చేస్తూ పోవాలి. అలా చేసిన‌ప్పుడు స్క్రాచ్ ఉంటే అక్క‌డ ఆగిపోతుంది. ఒక‌వేళ లేకుంటే గుడ్ జాబ్ అనే సందేశం వ‌స్తుంది. ఇదే కాక మీ ఫోన్లో ఉన్న సెన్సార్‌ను  చెక్ చేసుకోవ‌చ్చు. అంతేకాక మీ కెమెరా, లౌడ్ స్పీక‌ర్ ఇలా అన్ని ర‌కాల ఫీచ‌ర్ల గురించి మ‌నం టెస్టు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ ఏమైనా తేడా అనిపించినా లేదా మీకు ఫోన్లో ఒక సందేశం వ‌స్తుంది. ఆ ఫోన్లో ఫ‌లానా ఫీచ‌ర్ ప్రాబ్ల‌మ్ ఉంద‌ని... దాన్ని బట్టి మీ ఫోన్‌ను కొనుక్కునే అవ‌కాశం ఉంటుంది.

చాలా ఉప‌యోగం..
ఒక‌ప్పుడు మ‌నం పెద్ద‌గా ఏమీ  చూడ‌కుంటానే ఫోన్ బాగుంటే చాలు కొనేసేవాళ్లం. కానీ స్మార్ట్‌ఫోన్ కొనేట‌ప్పుడు అన్ని ఆప్ష‌న్లు త‌ప్ప‌కుండా చూసుకోవాలి. లేక‌పోతే మీరు డ‌బ్బులు న‌ష్ట‌పోయిన‌ట్లే. ఈ టెస్ట్ ఎం యాప్ ద్వారా మీరు ట‌చ్‌, డిస్‌ప్లే, కెమెరా ఇలా ఎన్నో ఆప్ష‌న్లు మీరు చెక్ చేసుకోవ‌చ్చు.  అప్ప‌టిక‌ప్పుడే ఆ విష‌యాన్ని అడిగేయ‌చ్చు. దీని వ‌ల్ల మీరు న‌ష్ట‌పోయే అవ‌కాశాలను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ యాప్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు