ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి, రిటర్నులు ఫైల్ చేయడానికి చాలా కాలం కిందటే అవకాశం ఇచ్చిన ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు యాప్ సేవలను కూడా తీసుకొచ్చింది. ‘ఆయకార్ సేతు’ పేరిట ప్రత్యక్ష పన్నుల బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ -సీబీడీటీ) రూపొందించిన మొబైల్ యాప్‌ను సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ నిన్న రిలీజ్ చేశారు. టాక్స్ సర్వీసులను మరింత ఈజీ చేయడమే కాక ఈ సెక్టార్లో వస్తున్న కంప్లయింట్లను కంట్రోల్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని జైట్లీ చెప్పారు.
* ఆయకార్ సేతు యాప్ లో టాక్స్ టూల్స్, లైవ్ చాట్ సదుపాయం, డైనమిక్ అప్డేట్స్, కీలకమైన లింకులు ఉన్నాయి.
* ఐటిడిలో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇంపార్టెంట్ టాక్స్ డేట్స్, ఫామ్స్, నోటిఫికేషన్లను సంబంధించి మొబైల్ అలర్ట్‌లు వస్తాయి.
మిస్స్డ్ కాల్‌తో కూడా డౌన్లోడ్
ఆయకార్ సేతు యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫాంపై వచ్చింది. దీన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7306525252 నెంబర్‌కు మిస్డ్ కాల్ చేసి కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది.
ఏమేం చేయొచ్చు?
* ఆయకార్ సేతు యాప్‌తో టీడీఎస్‌ను ట్రాక్ చేయొచ్చు.
* టాక్స్ పే చేయొచ్చు
* పాన్ కార్డ్ కోసం అప్లయి చేసుకోవచ్చు.
* ఆధార్ తో పాన్ లింకేజి కూడా చేసుకోవచ్చు.
* త్వరలో టాక్స్ రిటర్నులను కూడా యాప్ ద్వారా ఫైల్ చేసే ఫెసిలిటీని సీబీడీటీ అందుబాటులోకి తేనుంది.