• తాజా వార్తలు
  •  

మీ ఫోన్‌ను పోగొట్టుకునే ఛాన్సే లేకుండా చేసే సెరిబ్ర‌స్ 

స్మార్ట్‌ఫోన్ వాడ‌డ‌మే కాదు.. దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది వ‌ర‌కు పోతే ఫోనే పోయేది. స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాక మ‌న స‌మ‌స్త స‌మాచారం అందులోనే ఉంటుంది. కాబ‌ట్టి ఫోన్ పోతే ముందు దాన్ని మ‌న‌మే డిసేబుల్ చేయ‌గ‌లగాలి. మ‌నమే రిమోట్ మోడ్‌లో దాన్ని అన్‌లాక్ చేయాలి.  ఫోన్‌ను ట్రాక్ చేసి మ‌ళ్లీ దొర‌క‌బుచ్చుకోవాలంటే. .. ఇందుకోసం అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో వ‌చ్చింది సెరిబ్ర‌స్ (Cerberus).  ఇదొక యాంటీ థెప్ట్ యాప్‌. దీనిలో ఉన్న కొత్త ఫీచ‌ర్లు మీ ఫోన్ పోగొట్టుకోకుండా మ్యాగ్జిమం కాపాడ‌తాయి. 
 సెరిబ్ర‌స్ దాని అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లోనూ, గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. అయితే అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లో అయితే ఈ యాప్ సిస్టం ప్రాసెస్‌లో ప‌ని చేస్తుంది. అంటే దీన్ని మ‌న ఫోన్‌లో క‌న‌ప‌డ‌కుండానే యూజ్ చేసుకోవ‌చ్చు.  
*  యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాక ఓపెన్ చేసి Cerberus అకౌంట్  క్రియేట్ చేసుకోవాలి.  ఈ అకౌంట్ మీ ఈ-మెయిల్ అడ్ర‌స్‌తో లింక్ అవుతుంది. \
* అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక యాప్‌లోకి లాగిన్ అయితే Password , Device administration, Remote backup,  Remote wipe, 
Location history,  Video capture , Notification access ఆప్ష‌న్స్ క‌నిపిస్తాయి. 
* ఈ లిస్ట్‌లో కింద About sectionఉంది.  ఇది మీ డివైస్ యూనిక్ ఐడీ, సెరిబ్ర‌స్ లాగ్‌ను చూపిస్తుంది.  

ఇవీ ఫీచ‌ర్లు 
* ఒక  Cerberus అకౌంట్‌తో మూడు డివైస్‌ల‌ను మేనేజ్ చేసుకోవ‌చ్చు. 
* మీ ఫోన్ పోతే    సెరిబ్ర‌స్ యాప్‌ను ఓపెన్ చేసి Start tracking కోడ్‌ను టైప్ చేస్తే మీ ఫోన్ ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంది.  
*  Lock with code ఆప్ష‌న్‌తో మీరు రిమోట్ యాక్సెస్ ద్వారా పోగొట్టుకున్న మీ ఫోన్‌ను లాక్ చేయొచ్చు.  
* Start alarm with message ఆప్ష‌న్‌తో మీ ఫోన్‌లో మెసేజ్‌తోపాటు పెద్ద అలారం వ‌చ్చేలా చేయొచ్చు  
* Display message ఆప్ష‌న్‌తో మీ ఫోన్ పోయింద‌ని మెసేజ్ స్క్రీన్ మీద వ‌చ్చేలా చేసుకొఓవ‌చ్చు.  
* Take Picture :  ఈ ఆప్ష‌న్‌తో మీ ఫోన్‌ను దొంగిలించిన వ్య‌క్తిని ఫోన్ ఫ్రంట్‌, బ్యాక్ కెమెరాలు ఉప‌యోగించి ఫొటో తీయొచ్చు.  
* ఇంకా కాల్ రికార్డ్ చేయొచ్చు.  మీ ఫోన్‌లో మెమ‌రీని దొంగ చూడ‌కుండా ఎరేజ్ చేయొచ్చు.  మొత్తానికి ఆ ఫోన్‌ను మీరు మీ సెరిబ్ర‌స్ అకౌంట్ ద్వారా రిమోట్ మోడ్‌లో యాక్సెస్ చేసి మీ ద‌గ్గ‌రికి తెప్పించుకోవ‌చ్చు.  
 
ఫ్రీ యాప్ కాదు.. 
సెరిబ్ర‌స్ యాప్ ఫ్రీ కాదు. ప్ర‌స్తుతానికి ఒక వారం ఫ్రీ ట్ర‌య‌ల్ ఇస్తున్నారు.  330 రూపాయ‌లు పే చేస్తే లైఫ్‌టైం లెసైన్స్ ఇస్తారు. అయితే దీనిలో ఉన్న ఫీచ‌ర్లు, మీ ఫోన్ సేఫ్టీ  లెక్కేసుకుంటే ఇది పెద్ద అమౌంటేమీ కాదు. 
 

జన రంజకమైన వార్తలు