• తాజా వార్తలు

మీ ఫేస్ చూస్తే కానీ యాప్స్ ఓపెన్ కాకూడదా? అయితే ఈ ఉచిత యాప్స్ మీకోసం

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే యూజర్లకు ప్రతి నిత్యం ఎదురయ్యే సమస్య ప్రైవసీ. తమ ఫోన్ ఎవరైనా తీసుకుంటే అందులోని ఫోటోలు, వీడియోలు, మెసేజ్ చూస్తారని భయపడతారు. దీంతో ఇతరులకు ఫోన్ ఇవ్వాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీ ఫోన్ మిమ్మల్ని, మీ వాయిస్‌ను కూడా గుర్తిస్తుంది. మీ ముఖాన్ని గుర్తిస్తేనే మీ ఫోన్లో ఉన్న యాప్స్ ఓపెన్ అవుతాయి. అందుకు ఉప‌యోగ‌ప‌డే ఈ ఫ్రీ యాప్స్ వివ‌రాలు మీ కోసం.. 
యాప్ లాక్ ( applock face/voice recognition)
ఫ్రీ ఫేస్‌లాక్ ఆండ్రాయిడ్ యాప్.. యాప్స్ ఫ్రీగా ఓపెన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా ఇతరులు మీ యాప్స్‌ను ఓపెన్ చేయకుండా మీ ముఖాన్నే పాస్‌వ‌ర్డ్‌గా సెట్ చేయొచ్చు. ఫేస్ రికగ్నేషన్ ఒకటే కాదు వాయిస్ లాక్ కూడా ఉంది. యాప్స్ ఓపెన్ చేయడానికి మీరు ఫేస్‌తోపాటు వాయిస్ లాక్ కూడా ఉపయోగించవచ్చు. ఫేస్ లాక్, వాయిస్ లాక్ ద్వారా ఇతరులు మీ యాప్స్‌ను  ఓపెన్ చేయకుండా నియంత్రించవచ్చు.  ఈ యాప్ ను ఏ ఇతర ఆండ్రాయిడ్ యాప్ లాకర్లో అయినా అన్ ఇన్‌స్టాల్ చేయ‌లేం. కానీ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళితే అన్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. చేయకుండా నిరోధించవచ్చు.కాబ‌ట్టి సెట్టింగ్స్‌ను కూడా లాక్ చేయ‌డం మంచిది. ఈ యాప్ డిఫాల్ట్ గా మీ ఫొటోలు, వాయిస్‌ను స‌ర్వ‌ర్ల‌కు అప్‌లోడ్  చేస్తుంది.  అలా కాకుండా  ఉండాలంటే అడ్వాన్స్డ్  సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫోటోలు, వీడియో అప్‌లోడ్ ఆప్ష‌న్‌ను డిసేబుల్ చేయండి. ఫేస్ లాక్ ఆండ్రాయిడ్ యాప్‌లో రెండు మోడ్స్ ఉంటాయి. కన్వినెన్స్ మోడ్‌లో మీరు వాయిస్‌తో మాట్లాడవచ్చు. లేదా ఒక యాప్‌ను అన్‌లాక్ చేయ‌డానికి మీ ముఖాన్ని పాస్‌వ‌ర్డ్‌గా ఉపయోగించుకోవచ్చు. ట్రూలీ సెక్యూర్ మోడ్‌లో అయితే వాయిస్‌, ఫేస్ రెండూ మ్యాచ్ అయితేనే అన్‌లాక్ అవుతుంది. ఈ రెండింటిలో మీకు కావాల్సిన మోడ్‌నుసెట్ చేసుకోవ‌చ్చు.
అయోబిట్ యాప్ లాక్ ( Iobit applock-face lock)
 ఫేస్ లాక్ ఆండ్రాయిడ్ యాప్ మాదిరిగానే... దీనిలో కూడా ఎవ‌రైనా మీ స్టిల్ ఫొటో పెట్టి అన్‌లాక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే ఈజీగా ప‌ట్టేస్తుంది. యాప్‌ను అన్‌లాక్ చేస్తున్న‌ప్పుడు ముఖ కదలికలను గుర్తించి, అది యూజ‌ర్ కాద‌ని నిర్దారిస్తుంది. లాక్ ఫేస్ తోపాటు, యాప్స్ కు ఫేక్ లాక్, నోటిఫికేషన్ లాక్ వంటివి యాడ్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌లో వైఫై, ఆటో సింక్ వంటి స్విచ్‌ల‌ను కూడా లాక్ చేయ‌డం దీని స్పెషాలిటీ. అంతేకాదు మీ ఫోన్‌ను ఎవ‌రైనా అన్‌లాక్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తే వారి సెల్పీ కూడా తీస్తుంది. ఈ యాప్‌ను యాక్సెస్ చేయడం చాలా సులభం. గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేశాక  మిమ్మల్ని గుర్తించడానికి కెమెరాను ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు మీ ముఖాన్ని లాక్, అన్‌లాక్ చేయడానికి పాస్‌వ‌ర్డ్‌ను సెట్ చేస్తుంది.  ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఫేస్ రికగ్నేషన్ బటన్‌పై నొక్కండి. స్క్రీన్ నుంచి ఫేస్ రికగ్నేషన్ లాక్ చేయడానికి యాప్స్‌ను  సెలెక్ట్ చేసుకోండి. లాక్ చేసిన యాప్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే ఫేస్ స్కానర్ స్క్రీన్ ద్వారా వాళ్లను గుర్తిస్తుంది.
యాప్ లాక్ బై ఫేస్‌ ( applock by face)
ఈ యాప్ కూడా ఫేస్ రికగ్నేషన్ ద్వారా యాప్‌ను ఓపెన్ చేస్తుంది. యాప్‌న ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ ఫేస్‌ను గుర్తించడానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్‌. ఓవెల్ షేప్‌లో ఉంటే స‌ర్కిల్‌లో మీ ఫేస్ ఎడ్జ‌స్ట్ చేసి Train బ‌ట‌న్ నొక్కండి.  దీంతో మీ ఫేస్ రిక‌గ్నైజేష‌న్ రిజిస్ట‌ర్ అయింది. ఇప్ప‌డు దీన్ని ఉప‌యోగించి మీరు యాప్స్‌ను లాక్ చేయ‌డానికి, అన్‌లాక్‌చేయ‌డానికి మీ ఫేస్‌ను పాస్‌వ‌ర్డ్‌గా సెట్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ లాక్‌, అన్‌లాక్ చేయ‌డానికి కూడా ఈ యాప్ ఉపయోగ‌ప‌డుతుంది.
 

జన రంజకమైన వార్తలు