• తాజా వార్తలు

మీ కుటుంబ స‌భ్యులు 24/7 ఎవ‌రెక్క‌డున్నారో లొకేట్ చేసే యాప్ ఫ్యామిలీ

మ‌న కుటుంబ సభ్యులు బ‌య‌ట‌కు వెళుతుంటే కాస్త కంగారుగానే ఉంటుంది. ఎలా వెళ్తారో ఎలా వ‌స్తారో అనే ఆందోళ‌న లోపల ఉంటుంది. వాళ్లు తిరిగి ఇంటికి వ‌చ్చే వ‌ర‌కు ఆ ఆలోచ‌న‌లు మ‌న‌కు వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్ల‌లు బ‌య‌ట‌కు వెళితే ఇంకా ఇంకా ఆందోళ‌న‌గా ఉంటుంది. వారి భ‌ద్ర‌త ఎలా ఉంటుందో అనే  ఆలోచ‌న ప‌దే ప‌దే వ‌స్తుంది. ఇలాంటి ఆందోళ‌న నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి ఒక యాప్ అందుబాటులోకి వ‌చ్చింది దాని పేరే ఫ్యామిలీ!

ఏమిటీ ఫ్యామిలీ?
మ‌న ఆత్మీయులు ఎవ‌రు ఎక్క‌డ ఉన్నారో తెలుసుకుని మ‌న‌కు అలెర్ట్స్ అందించ‌డ‌మే ఈ ఫ్యామిలీ యాప్ ప్ర‌త్యేక‌త‌. అంటే వాళ్లు ఉన్న ఏరియాను లొకేట్ చేసి ఇది ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌కు స‌మాచారం అందిస్తుంది. వాళ్లు ఉన్న లొకేష‌న్‌ను ఆక్యురేట్‌గా అందించ‌డం మ‌న‌కు వాళ్లు ఎక్క‌డ ఉన్నారో అనే దానిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. దీనిలో బ్యాట‌రీ ఎఫెసియ‌న్సీ, ఎమ‌ర్జెన్సీ అలెర్ట్స్‌, స్పీడ్ లిమిట్ కంట్రోల్‌, గ్రూప్, ప్రైవేట్ చాట్ లాంటి ఆప్ష‌న్లు ఉన్నాయి.

ఎలా ఉప‌యోగించాలంటే..
1.ముందుగా యాప్ స్టోర్‌కు వెళ్లి ఫ్యామిలీ లొకేట‌ర్ బై ఫ్యామిలీ అనే యాప్‌ను మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌ల‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2.ఈ యాప్‌ను ఓపెన్ చేసి ఫేస్‌బుక్ లేదా గూగుల్  లేదా మెయిల్ ద్వారా ఓపెన్ చేయాలి.
మెయిల్ ద్వారా ఓపెన్ చేస్తే మీ మెయిల్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి. అంతే మీ ఫ్యామిలీ అకౌంట్ క్రియేట్ అవుతుంది.
ఈ అకౌంట్ క్రియేట్ చేసిన త‌ర్వాత మీ లొకేష‌న్‌కు యాక్సెస్ ఇవ్వాలి. యాప్ యూజ్ చేస్తున్న‌ప్పుడు మాత్ర‌మే లొకేష‌న్ యాక్సెస్ ఇచ్చ‌కోవ‌చ్చు

3.ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత వాళ్లను కూడా లొకేట్ చేయాలి.
మీ స‌ర్కిల్‌లో జాయిన్ అయిన వాళ్ల కోడ్‌ల‌ను కూడా మీరు షేర్ చేయాలి. మీ స‌ర్కిల్‌లోకి జాయిన్ అయితే చాలు వాళ్లు మీ లొకేష‌న్ ప‌రిథిలోకి వ‌స్తారు. 

4.ఫ్యామిలీ మెంబ‌ర్స్ మాత్ర‌మే ఫ్రెండ్స్ వివ‌రాలు కూడా ఇందులో ఎంట‌ర్ చేయ‌చ్చు. వాళ్లు ఎక్క‌డ ఉన్నా ఏం చేస్తున్నా మీకు లొకేష‌న్ వివ‌రాలు వ‌చ్చేస్తాయి. వారితో మాట్లాడే అవ‌కాశం, చాట్ చేసే అవ‌కాశం కూడా దీనిలో ఉంది.

జన రంజకమైన వార్తలు