• తాజా వార్తలు

బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసిన గూగుల్‌

ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ను తాను మార్చ‌కుంటూ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యాప్‌ల‌ను, టెక్నాల‌జీని ఆవిష్క‌రించ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందుంటుంది. ఇందులో భాగంగానే ఆ సంస్థ తాజాగా ఫొటోస్ అప్‌లోడ్ ఫీచ‌ర్‌తో బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసింది. బ్యాక్అప్ ప్రాసెస్‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయ‌డానికే ఈ కొత్త యాప్‌ను విడుద‌ల చేసిన‌ట్లు గూగుల్ తెలిపింది. ఫొటోల‌ను, ఫైల్స్‌ను సంర‌క్షించ‌డ‌మే కాక‌.. మొత్తం డివైజ్‌ను బ్యాక్అప్ చేయ‌డం ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. 

సింపుల్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌
గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ కొత్త సింక్ యాప్‌ ఉచితంగా డౌన్‌లోడ్ అవుతుంది. ఈ సింపుల్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ సిస్ట‌మ్ బ్యాక్అప్‌కు గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆ సంస్థ తెలిపింది. అయితే  ఈ యాప్ ఉప‌యోగించాలంటే ముందుగా గూగుల్ ఐడీతో సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఒక‌సారి టూల్ ఓపెన్ కాగానే ఆటోమెటిక్‌గా మీ డివైజ్‌ను బ్యాక్ అప్ చేయ‌డం ప్రారంభిస్తుంది. ఏమైనా తేడా ఉన్నా సెట్టింగ్స్‌లో ప్రిఫ‌రెన్స‌స్‌ను ఛేంజ్ చేసుకుంటే స‌రిపోతుంది. 

ఇమేజ్ క్వాలిటీ.. స్వేస్ సేవ‌ర్‌
ఈ కొత్త టూల్‌తో గూగుల్ ఫొటోస్ ఇమేజ్ క్వాలిటీని కూడా మ‌నం పెంచుకోవ‌చ్చు. హెచ్‌క్యూ అన్‌లిమిటెడ్ స్టోరేజ్ లేదా హైక్వాలిటీ విత్ లిమిటెడ్ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ అప్ ఫొటోల‌ను హ్యాండిల్ చేసే తీరే ఈ యాప్‌ను ప్ర‌త్యేకంగా నిల‌బెడుతుంది. కొత్త‌గా యాడ్ అయిన ఫొటోల‌ను, వీడియోల‌ను కూడా క్లౌడ్‌లో ఆటోమెటిగ్గా అప్‌లోడ్ అయ్యేలా చేసుకోవ‌చ్చు.

తాజాగా మీ స్టోరేజ్ 
గూగుల్ బ్యాక్ అప్‌, సింక్ ఆప్ష‌న్ల వ‌ల్ల మ‌న స్టోరేజ్ ఎప్ప‌టికప్పుడు తాజాగా ఉంటుంది. మ‌నం అన‌వ‌స‌ర‌మైన ఫొటోల‌ను, వీడియోల‌ను, లేక‌పోతే డూప్లికేట్ ఫొటోల‌ను వెంట‌నే డిలీట్ చేసుకోవ‌చ్చు. స్టోరేజ్ ఎక్కువ‌వుతున్న‌ప్పుడు, డూప్లికేట్ ఫొటోలు ఉన్న‌ప్పుడు అంటే ఇది మాక్‌బుక్‌లాగా ప‌ని చేస్తుంది. ప్ర‌స్తుతానికి ఇది 128 జీబీ స్టోరేజ్‌ను ఆఫ‌ర్ చేస్తుంది. అయితే ఈ స్టోరేజ్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. డ్రైవ్ ఫైల్ సిస్ట‌మ్ టూల్‌ను కూడా గూగుల్  త‌మ ఇంటర్‌ప్రైజ్ క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తుంది. సింక్ చేయ‌డం కూడా సుల‌భ‌మే. డెస్క్‌టాప్ మీద ఫైల్స్‌ను బ్యాక్ అప్ చేయ‌డానికి సింక్‌, బ్యాక్ అప్ యాప్ గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాదు గో ప్రొ, డీఎస్ఎల్ఆర్‌ల నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఇమేజ్ ఫైల్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికి కూడా ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది.
 

జన రంజకమైన వార్తలు