• తాజా వార్తలు
  •  

పెన్ష‌న‌ర్ల సమస్యలు దూరం చేసే కొత్త యాప్

ఉద్యోగులు రిటైర్ అయిన త‌ర్వాత పెన్ష‌న్ ద్వారా వ‌చ్చే మ‌నీతోనే జీవ‌నం సాగిస్తారు. అందుకోసం ప్ర‌తి నెల త‌మ జీతంలో కొంత భాగాన్ని భ‌విష్య నిధికి కేటాయిస్తారు. అయితే ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్ రావ‌డం కూడా ఒక పెద్ద ప్ర‌క్రియే. దానికి ఎన్నోఅవ‌రోధాలు ఉంటాయి. ఫార్మాల‌టీస్ పూర్తి చేయాలి. అధికారుల చుట్టూ తిర‌గాలి. నెల‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేయాలి. ఇంత క్లిష్ట‌మైన ప్ర‌క్రియను సుల‌భం చేయ‌డానికి ప్ర‌భుత్వం సంక‌ల్పించింది.  పెన్ష‌న‌ర్ల సౌల‌భ్యం కోసం ఒక కొత్త యాప్‌ను త‌యారు చేసింది. ఈ యాప్‌ను ఇటీవ‌లే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విడుద‌ల చేశారు.

ఏమిటీ యాప్‌?
సాధార‌ణంగా పెన్ష‌న్ వ‌స్తుందంటే ప్ర‌తి నెలా ఇంత మొత్తం అమౌంట్ మ‌న ఖాతాలో జ‌మ అవుతూ ఉంటుంది. గ‌తంలో పెన్ష‌న్ డ‌బ్బుల‌ను పెన్ష‌న్ ఆఫీసుకు వెళ్లి తీసుకోవాల్సి వ‌చ్చేది. ఊళ్ల‌లో అయితే ట్రెజ‌రీల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోవ‌డంతో పెన్ష‌న్ ప‌నులు కూడా సుల‌భం అయిపోయాయి. ప్ర‌తి నెల  మ‌న పింఛ‌ను మ‌న ఖాతాలోకి ప‌డిపోతుంది. ఎవ‌రినీ దీని గురించి అడ‌గాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఫోన్ నంబ‌ర్లు మార్చుకోవ‌డానికి, అడ్రెస్ ఛేంజ్ చేసుకోవ‌డానికి, ఒక‌వేళ బ్యాంకు ఖాతాను మార్చుకోవాల్సి వ‌స్తే రిక్వ‌స్ట్ పెట్టుకోవ‌డానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందుల‌ను గ‌మ‌నించిన ప్రభుత్వం దీని కోసం ఈ పెన్ష‌న్ యాప్‌ను సృష్టించింది.  

ఎలా ప‌ని చేస్తుంది?
పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ (పీపీవో) పేరుతో ఒక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు దీని వ‌ల్ల ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన రోజే అత‌నికి పెన్స‌న్ ఖాతా మొద‌లు అయిపోతుంది.  దీని కోసం ఈ పెన్ష‌న్ యాప్‌లో ఒక పెన్ష‌న్ పోర్ట‌ల్ ఏర్పాటు చేశారు. ఆ పోర్ట‌ల్‌లో పెన్ష‌న‌ర్ అనేక స‌ర్వీసుల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.  త‌న తొలి పెన్ష‌న్ ఏరోజు, ఏ తేదీని ప‌డింది, యాక్ష‌న్ టేకెన్‌, కాలుక్యులేటింగ్ కంప్యూటింగ్ పెన్ష‌న్‌, ఫీడ్‌బ్యాక్ లాంటి ఆప్ష‌న్లు దీనిలో ఉన్నాయి. వాట్స్ న్యూ అనే ఫీచ‌ర్‌లో మీ కోసం  ప్ర‌భుత్వం కొత్త‌గా ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కూడా చూడొచ్చు.  అనుభ‌వ్ పేరుతో 16 మంది పెన్ష‌న‌ర్ల‌కు అవార్డులు కూడా ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. పెన్ష‌న్ అదాల‌త్‌ల ద్వారా పెన్ష‌న‌ర్ల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు కూడా ప్ర‌భుత్వం తెలిపింది. 

జన రంజకమైన వార్తలు