• తాజా వార్తలు

ఆగ్మెంటెడ్ రియాల్టీలో ముంచెత్తే హోలో యాప్

నాలుగేళ్ల కింద‌ట సోనీ .. ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్‌) మోడ్ ఉన్న కెమెరాతో కూడిన   ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అప్ప‌ట్లో అది చాలాగొప్ప‌. ఇప్పుడు చాలా ఫోన్లు, యాప్స్ ఈ ఫీచ‌ర్‌ను ఇస్తున్నాయి.  ర‌క‌ర‌కాల ఆబ్జెక్ట్‌లు ఈ యాప్స్ ఫిల్ట‌ర్‌లో ఉంటాయి. వాటిని మ‌న ఇమేజ్ లేదా వీడియోకు ఎటాచ్ చేసుకోవ‌చ్చు. ఫేస్‌బుక్ కూడా ఇలాంటి ఫీచ‌ర్ల‌ను త‌న కెమెరాలో తీసుకొచ్చింది. ఇప్పుడు హోలో అనే యాప్ మ‌రింత ముంద‌డుగు వేసి 3డీ ఇమేజెస్‌ను కూడా దీనికి జ‌త‌క‌లిపింది. ఇప్ప‌టివ‌రకు వ‌చ్చిన ఏఆర్ యాప్స్ అన్నింటి కంటే సుపీరియ‌ర్ ఫీచ‌ర్లు దీనిలో ఉన్నాయి.

 

ఆండ్రాయిడ్‌, ఐవోఎస్

ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ ఈ యాప్ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. యాప్‌ను ర‌న్ చేయాలంటే  కెమెరా , మైక్రోఫోన్, స్టోరేజ్ యాక్సెస్ త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి.  హోలో యాప్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. లేదంటే ఫేస్‌బుక్ అకౌంట్‌తోనయినా లాగిన్ కావ‌చ్చు.   లేక‌పోతే మీ ఇమేజెస్‌, వీడియోల‌ను సేవ్ చేయ‌లేరు.

 

చాలా స్పెష‌ల్ 

* మీరు ఇప్ప‌టికే తీసుకున్న ఇమేజెస్  హోలో యాప్‌లోని ఏఆర్ ఆబ్జెక్ట్స్‌ను యాడ్ చేయొచ్చు.

* గ‌తంలో వ‌చ్చిన ఏఆర్ కెమెరా యాప్స్ కంటే ఇందులో మెరుగైన ఫీచ‌ర్లు ఉన్నాయి. స్పైడ‌ర్ మ్యాన్, కుక్క‌పిల్ల‌, అమ్మాయి బొమ్మ ఇలా ర‌క‌రకాల   ఏఆర్ ఆబ్జెక్ట్స్ డిఫ‌రెంట్ మూడ్స్‌, ఫోజెస్‌తో ఉన్నాయి. కావాలంటే కొత్త‌వి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

యాప్‌ను ఓపెన్ చేసి ఇమేజెస్ తీసుకోవ‌చ్చు. 13 సెక‌న్ల నిడివితో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు.  

* ఏఆర్ ఆబ్జెక్ట్స్‌ను కావాల్సిన‌వైపుకు ట‌ర్న్ చేసుకోవ‌చ్చు. సైజ్ కూడా పెంచుకోవ‌చ్చు. త‌గ్గించుకోవ‌చ్చు. 

* వీటితో చేసిన ఇమేజెస్ లేదా వీడియోస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు లేదా అక్క‌డి నుంచే నేరుగా షేర్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు