• తాజా వార్తలు

ఏఆర్ ఎంత స‌ర‌దాగా ఉంటుందో చూపే యాప్ హోలో!

పొకెమ‌న్ గో విప్ల‌వం వ‌చ్చిన త‌ర్వాత డెవ‌ల‌ప‌ర్స్ ఆలోచ‌న‌లోనూ మార్పులొచ్చాయి. యూజ‌ర్ల‌ను ఎంగేజ్ చేస్తూ వారికి ఆనందాన్ని అందించే యాప్‌ల‌పైనే వారు దృష్టి సారించారు. అంటే మ‌న‌కు ఉన్న‌ది లేన‌ట్లు చూపిస్తే ఎంతో థ్రిల్ ఫీల్ అవుతాం. ఇప్పుడు డెవ‌ల‌ప‌ర్స్ కూడా ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల‌లోనూ ఇప్ప‌టికే పొకెమ‌న్ గో గేమ్‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ఈ నేప‌థ్యంలో రియాల్టీని బేస్ చేసుకుని గేమ్‌లు, యాప్‌లు త‌యారు చేయ‌డానికి డెవ‌ల‌ప‌ర్స్ ముందుకొస్తున్నారు. అలాంటి కోవ‌కు చెందిందే అగ్యుమెంటెడ్ రియాల్టీ ఫీచ‌ర్స్ (ఏఆర్). ఈ ఏఆర్ సాంకేతిక‌తో వ‌చ్చిన శ‌క్తివంత‌మైన యాప్‌నే హోలో.

ఇదో కెమెరా యాప్‌
హోలో అనేది ఒక కెమెరా యాప్‌. అగ్యుమెంటెడ్ రియాల్టీ ఆధారంగా ప‌నిచేస్తుంది. అడ‌విలో ఉండే పులి, ఆడుకుంటున్న కుక్క ఎలా ఏదైనా క‌దులుతున్న వాటిని మ‌నం ఈ కెమెరాతో ఫొటో తీయాలి. ఆ త‌ర్వాత 3డీ అబ్‌జెక్ట‌ల‌ను వాటికి యాడ్ చేసుకునే అవ‌కాశం హోలో యాప్ ద్వారా దొరుకుతుంది. దీంతో మ‌నం  వాటి ప‌క్క‌న నుంచున్న‌ట్లో లేదా వాటి బ్యాక్‌గ్రౌండ్లో ఉన్న‌ట్లో అనుభూతి క‌లుగుతుంది. మూవీ కారెక్ట‌ర్లు, సెల‌బ్రెటీలు, మ్యుజిషియ‌న్లు, అథ్లెట్స్‌, జంతువులు ఇలా ఎవ‌రినైనా స‌రే మ‌న కెమెరా ద్వారా బంధించి వాటితో మ‌నం ఉన్న‌ట్లు అనుభూతిని క‌లిగించ‌డ‌మే హోలో యాప్ ప్ర‌త్యేక‌త‌.   ఒక‌సారి మ‌నం ఎడిట్ చేసుకున్నాక‌ ఆ ఫొటోల‌ను, వీడియోల‌ను సేవ్ చేసి షేర్ చేసుకోవ‌డం కూడా సుల‌భంగా ఉంటుంది. 

రియ‌ల్‌టైమ్ ఎడిటింగ్‌
హోలో యాప్‌లో ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త రియ‌ల్ టైమ్ ఎడిటింగ్‌. అంటే మ‌నం ఏదైనా వీడియోను షూట్ చేస్తున్న‌ప్పుడు మ‌నం ఎడిటింగ్ చేసుకోవ‌చ్చు.  కారెర్ట‌క్ సైజు, మంచి నేచుర‌ల్ లుక్ రావ‌డానికి ఎడ్జెస్ట్‌మెంట్లు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు మనం ఎడిట్ చేసిన వీడియోలు, ఫొటోలను జిఫ్ రూపంలో దాచి ఉంచ‌డానికి ఒక స్టోర్ కూడా ఉంటుంది. అంటే మ‌నం ప్ర‌త్యేకంగా ఫొటోల్లో వెతుక్కోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఏ వీడియోకు సంబంధించిన జిఫ్ ఫైళ్ల‌ను మ‌రో వీడియోకు వాడుకోవ‌చ్చు. అంతేకాదు ఎడిటింగ్ చేసేట‌ప్పుడు ఫోన్ స్లో కాకుండా చూడ‌డం హోలోలో ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త‌. ఇప్పుడు కొన్ని ఫోన్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ యాప్‌.. మున్ముందు అన్ని స్మార్ట్‌ఫోన్ల‌లోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

జన రంజకమైన వార్తలు