• తాజా వార్తలు
  •  

ఎం ఆధార్ యాప్ గురించి మ‌నం తెలుసుకోవాల్సిన కీల‌క‌మైన విష‌యాలివీ..

ఆధార్ కార్డ్ లేనిదే ఫ్యూచ‌ర్‌లో ఇండియాలో ఏ ప‌నీ జ‌ర‌గ‌దేమో. అంత‌గా ప్ర‌తి ప‌నిలోనూ గ‌వ‌ర్న‌మెంట్ ఆధార్‌ను ఇన్వాల్వ్ చేస్తుంది. అందుకే యూజ‌ర్ల కోసం ఆధార్ ఇష్యూ అథారిటీ  UIDAI  mAadhaar యాప్‌ను కూడా రిలీజ్ చేసింది.  10 ల‌క్ష‌ల మందికి పైగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు.  ఆధార్ కార్డ్ ను ఫిజిక‌ల్‌గా వెంట‌బెట్టుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా స్మార్ట్‌ఫోన్‌లో  తీసుకెళ్ల‌డం ఈ యాప్‌లో ఉన్న ప్ర‌ధాన‌మైన సౌల‌భ్యం.  రైల్ ప్ర‌యాణంలో కూడా ఈ యాప్‌లో మీ ఆధార్ కార్డ్‌ను చూపించ‌వ‌చ్చు.  
ఎం ఆధార్ యాప్ గురించి తెలుసుకోవాల్సిన  విష‌యాలు  
1. ఎం ఆధార్ యాప్ ఆండ్రాయిడ్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 5.0 , ఆ త‌ర్వాత వ‌చ్చిన ఓఎస్‌లున్న ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మాత్ర‌మే ప‌ని చేస్తుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఈ యాప్‌ను యూజ్ చేసుకోవాల‌టే మీరు ఆధార్ కార్డ్ తీసుకున్న‌ప్పుడు ఇచ్చిన  మొబైల్ నెంబ‌ర్‌తో  రిజిస్ట‌ర్ చేసుకోవాలి.
3.  రిజిస్ట‌ర్ చేసుకున్నాక మీకు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని యాప్ ఆటో రీడ్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం మాన్యువ‌ల్ఓగా టీపీ ఎంట‌ర్ చేయ‌డానికి వీల్లేకుండా చేశారు. టైం బేస్డ్ వ‌న్‌టైం పాస్‌వ‌ర్డ్ (TOTP) కూడా వాడుకోవ‌చ్చు.
4. ఎం ఆధార్ యాప్‌లో యూజ‌ర్లు త‌మ బ‌యోమెట్రిక్ డేటాను లాక్‌/ అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. 
5. ఈ యాప్‌ను ఒకసారి ఒక డివైస్‌లో మాత్ర‌మే యూజ్ చేసుకోగ‌లం. వేరే డివైస్‌లో మీరు ఈ సిమ్‌తో యాప్ డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేసి ఉంచినా కొత్త‌గా మ‌రో డివైస్‌లో ఓపెన్ చేస్తే పాత‌ది డిజేబుల్ అయిపోతుంది. 
6. మీతోపాటు మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కు కూడా ఆధార్ రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో ఇదే ఫోన్ నెంబ‌ర్ ఇచ్చి ఉంటే అంద‌రి వివ‌రాలు ఈ యాప్‌లో చూసుకోవ‌చ్చు. దీనికి మ్యాక్సిమం లిమిట్ ముగ్గురు మెంబ‌ర్ల డేటా. 
7. ఈ యాప్‌ను బ్యాంక్‌లు వంటి వాటిలో మీ ఆధార్ వివ‌రాల కోసం ఈ కేవైసీగా కూడా వాడుకోవ‌చ్చు.
8. ఐ ఫోన్ యూజ‌ర్ల‌కు మాత్రం ఎం ఆధార్ యాప్ అందుబాటులో లేదు.  

జన రంజకమైన వార్తలు