• తాజా వార్తలు
  •  

రద్దీ ప్రదేశంలో పార్కింగ్ ను చిటికెలో వెతికి పెట్టే యాప్ 

రద్దీ ప్రదేశాల్లో పార్కింగ్ సమస్య చాలా కామన్. షాపింగ్ మాల్స్,  పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లేదా బ‌హిరంగ‌ సభలకు వెళ్లినప్పుడు పార్కింగ్ దొరక్క ఇబ్బందులు పడుతుంటాం. అస‌లు పార్కింగ్ ఎక్క‌డో తెలియదు కూడా.  ఇలాంటి ఇబ్బంది లేకుండా ఓ యాప్ అందుబాటులోకి రాబోతోంది. జస్ట్ పార్క్ (JustPark)  పేరుతో ఫ్రీ పార్కింగ్ స్థలాన్ని కనుగొనడానికి ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం యాప్ అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా లాస్‌వెగాస్‌, లాస్ఏంజిల్స్, లండన్‌తోపాటు వెయ్యి నగరాల్లో 2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ పార్కింగ్ స్థలాలను గుర్తించడంలో ఈ యాప్ డేటా బేస్ మీకు సహాయం చేస్తుంది. 
యాప్ హైలైట్స్‌
* మ్యాప్‌లో ఏదైనా సిటీని సెలెక్ట్ చేసుకుంటే ఆ నగరంలోని అన్ని పార్కింగ్ స్థలాలను ఆటోమేటిగ్గా ఈ యాప్ డిస్‌ప్లే చేస్తుంది.   స్టేడియంలు, ఎయిర్‌పోర్టులు, స్టేషన్లు ఇలా అన్ని పార్కింగ్ స్థలాలు ఈ లిస్ట్‌లో ఉంటాయి. 
* నగరాల్లోని  పార్కింగ్ ప్లేస్‌లు జస్ట్ పార్క్‌తో రిజిస్టర్ చేసి ఉంటాయి. మీరు ఆ ప్లేస్‌కు వెళ్లే ముందే పార్కింగ్ ప్లేస్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. 
* కరెంట్ లొకేషన్‌తోపాటు అక్కడ పార్కింగ్ స్థలానికి ఎంత చెల్లించాలి? ఎంత దూరం ఉంటుందో కూడా యాప్ లో చూపిస్తుంది. 
* జ‌స్ట్ పార్క్ వసూలు చేసే ధర స్ట్రీట్ పార్కింగ్ కంటే తక్కువగా ఉంటుందని యాప్ డెవ‌ల‌ప‌ర్స్ చెబుతున్నారు. ఈ యాప్‌లో బెస్ట్ ఫీచర్ ఏమిటంటే మీరు యాప్ లో రిజర్వేషన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఏదైనా పార్కింగ్ ప్లేసును డైరెక్ట్ గా అడ్వాన్స్ బుక్‌ చేసుకోవచ్చు.
* జస్ట్ పార్క్ యాప్ ఐఫోన్, ఆండ్రాయిడ్ రెండింటికీ అందుబాటులో ఉంది.  
ఆండ్రాయిడ్‌లో ఎలా ప‌ని చేస్తుంది?
 1.ఆండ్రాయిడ్ ఫోన్‌లో జ‌స్ట్ పార్క్ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి.
2. మీకు కావాల్సిన పార్కింగ్ ప్రదేశాలను గుర్తించడానికి మీ డెస్టినేషన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరున్న లొకేషన్‌కు దగ్గరగా పార్కింగ్ కావాలంటే Park Nearby Now ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.   లేదా మీకు కావాల్సిన లొకేషన్ రిజిస్ట‌ర్ చేయ‌డానికి సెర్చ్ బాక్స్‌ను వాడుకోవ‌చ్చు. 
3.మీరు సెలక్ట్ చేసిన లొకేషన్‌ను యాప్ కనుగొన్న తర్వాత arrive at, Stay Until ల్లో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేసి డేట్, టైమ్ ఎంటర్ చేయాలి.  దీంతో మీకు దగ్గర్లో ఉన్న పార్కింగ్ ప్లేస్‌లు క‌నుక్కోవ‌డం ఈజీ అవుతుంది.
4. సెర్చ్ బటన్ నొక్కితే ఆటోమేటిగ్గా పార్కింగ్ స్థలాలన్నింటినీ సెర్చ్ చేస్తుంది. మ్యాప్‌లో డ్రాప్ పిన్స్‌తో సహా డిస్‌ప్లే చేస్తుంది. పార్కింగ్ స్థలం ఎంత దూరం ఉంది?  పార్కింగ్ ఫీజు ఎంతో కూడా చూపిస్తుంది.
5. పార్కింగ్ ప్లేస్ ఫోటోలను గూగుల్ మ్యాప్స్ సాయంతో 3డీ స్ట్రీట్ వ్యూలో కూడా చూపిస్తుంది.
6. పార్కింగ్ ప్లేస్  బుక్ చేసుకోవడానికి Reserve బటన్ పై నొక్కండి. తర్వాత మీ వెహిక‌ల్ డిటెయిల్స్ ఎంట‌ర్‌చేయాలి. ఇది పూర్తయ్యాక పేపాల్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. 

జన రంజకమైన వార్తలు