యాప్స్ వచ్చాక మనకు చాలా పనులు ఈజీ అయిపోయాయి. వైద్య రంగంలోనూ ఆన్‌లైన్‌లోనూ మెడిసిన్స్ ఆర్డర్ ఇస్తే ఇంటికే తెచ్చివ్వడం, ఫిజియోథెరపీ, ల్యాబ్‌టెక్నీషియన్స్ వంటి సర్వీసులు యాప్‌తో బుక్ చేసుకుంటే ఇంటికే వచ్చి చేసివ్వడం చూస్తున్నాం. ఇక డాక్టర్లా సలహాలిచ్చే యాప్స్ కూడా ఆండ్రాయిడ్ లో ఉన్నాయి. ఇవి వైద్యులకు, వారి చికిత్సకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. అంతేకాదు ఈ యాప్స్‌లో చూసి ఫాలో అయితే డయాగ్నోసిస్ తప్పి ప్రాణాంతకమైన వ్యాధులను కూడా త్వరగా గుర్తించలేకపోవచ్చు. అయితే ఆరోగ్యపరమైన అవగాహనకు పనికొస్తాయి, అత్యవసర సమయాల్లో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి వంటి కొన్ని సజెషన్స్ ఇస్తాయి.
సింప్టమ్ చెకర్స్ అండ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ యాప్స్
జనరల్ మెడికల్ కేర్‌కు సంబంధించిన ప్లే స్టోర్‌లో చాలా యాప్స్ ఉన్నాయి. మీ సింప్టమ్స్‌ను బట్టి కొన్ని సలహాలిస్తాయి.
* iTriage Health అనేది ఈ తరహా యాప్స్‌లో ప్రముఖమైనది. దీనిలో బోల్డంత డేటా బేస్ ఉంది. ఇదంతా హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్లతో రివ్యూ చేయబడుతుంది. ముఖ్యంగా మనకు వచ్చే జబ్బులకు సంబంధించిన ఎన్నో అపోహాలకు దీనిలో సమాధానాలుంటాయి. దీనిలో జలుబు, జ్వరం లాంటి సాధారణ రుగ్మతలకు సంబంధించిన ఏం మెడికేషన్ తీసుకోవాలో వివరాలుంటాయి. ఈ యాప్ జియో లొకేషన్లో కనుక మీరు ఉంటే స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరున్నారో కూడా సజెస్ట్ చేస్తుంది.
* ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలో సలహాలిచ్చే యాప్స్ కూడా ఉన్నాయి.
* Ada Personal Health Companion యాప్‌లోనూ సింప్టమ్ చెకర్ ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ బేస్డ్గా పని చేస్తుంది. ఇందులో ఉండే బోట్ మీ సింప్టమ్స్‌ను అడిగి, మీ ఫిజికల్ యాక్టివిటీని ట్రాక్ చేసి రిపోర్ట్ తయారుచేసింది. ఆ రిపోర్ట్‌ను కంపైల్ చేసి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా అలాంటప్పుడు ఎలాంటి రుగ్మతలు రావచ్చో ఓ అంచనాకు వస్తుంది. దీనిపై ప్రొఫెషనల్స్‌తో చర్చించి డాక్టర్లను మనకు సజెస్ట్ చేయడంతోపాటు వారికి మన సింప్టమ్స్ రిపోర్ట్లు కూడా పంపిస్తుంది.
మెంటల్ హెల్త్ యాప్స్
మానసిక రుగ్మతలతో బాధపడేవారికోసం ప్రత్యేకించి యాప్స్ ఉన్నాయి.
TalkLife
మెంటల్ హెల్త్, డిప్రెషన్, సెల్ఫ్ హామ్, ఈటింగ్ డిజార్డర్స్ వంటి తీవ్ర మానసిక సమస్యలున్నవారికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలున్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి చాట్ చేస్తే కొంత వరకు ఉపశమనం దక్కే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి యాప్‌లు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయని కూడా నిపుణులు చెబుతన్నారు.
7 Cups link
మానసిక సమస్యలతో బాఢపడేవారికి స్వాంతన చేకూర్చడానికి ఈ యాప్‌లో థెరపిస్ట్‌లు, కౌన్సెలర్ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సబ్స్క్రిప్షన్ ఫీజ్ చెల్లించాలి. అయితే ఇది మామూలుగా థెరపిస్ట్‌లు, ప్రైవేటు సైకాలజిస్టులు తీసుకునే ఫీజుల కంటే తక్కువ ఉంటుంది. యూజర్లు ఫ్రీ ట్రయల్‌తో చెక్ చేసుకున్నాకే సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు.
ఇతర హెల్త్ యాప్స్
ఫిజియోథెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, కార్డియాక్ (గుండె) హెల్త్, ఫిట్నెస్ వంటి వాటికి సంబంధించిన బోల్డన్ని యాప్‌లు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.