• తాజా వార్తలు

వినికిడి స‌మ‌స్య ఉన్న‌వారికి వ‌రం..  మొబైల్ ఇయ‌ర్స్ యాప్‌

 


 ఏదైనా ఒక సౌండ్ విన‌ప‌డ‌క‌పోతే ఎంత ఇబ్బంది ఉంటుందో వినికిడి స‌మ‌స్య ఉన్న‌వారికి బాగా తెలుసు. అందుకే ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు హియ‌రింగ్ ఎయిడ్స్ (చెవిలో పెట్టుకునే ప‌రిక‌రాలు) వాడుతుంటారు.  ఇవి మామూలు సౌండ్‌ను ఫ్రీక్వెన్సీ పెంచి పెద్ద‌గా వినప‌డేలా చేస్తాయి. దీంతో ఓ మాదిరిగా వినికిడి లోపం ఉన్న‌వారికి ఆ సౌండ్ వినిపిస్తుంది. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ ఓ యాప్ కూడా వ‌చ్చింది.  వినికిడి స‌మ‌స్య ఉన్న‌వారికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఈ యాప్ పేరు   Mobile Ears.

ఇలా ప‌ని చేస్తుంది.. 
స్వల్ప స్థాయి నుంచి ఓ మోస్త‌రు వినికిడి స‌మ‌స్య ఉన్న‌వారికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. Mobile Ears యాప్‌లో స్పీచ్  యాంప్లిఫికేష‌న్ టెక్నాల‌జీ ఉంటుంది.   దీనిని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సౌండ్‌ను 25 నుంచి 60 డెసిబుల్స్ వ‌ర‌కు పెంచి వినిపిస్తుంది. అంతేకాదు వాయిస్ కూడా క్లియ‌ర్‌గా ఉంటుంది. దీంతో చెవుడు ఉన్న‌వారికి కూడా బాగా వినిపిస్తుంది.  ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకునేట‌ప్పుడు గ్రూప్ క‌న్వ‌ర్జేష‌న్‌లోగానీ ఈ యాప్ చాలా చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఓ మోస్త‌రు వినికిడి స‌మ‌స్య ఉన్న ల‌క్ష‌లాది మంది ఇండియ‌న్స్‌కు ఈ యాప్ బాగా ఉప‌యోగ‌పడుతుంద‌ని దీన్ని త‌యారుచేసిన కంపెనీ చెబుతోంది. 

ఐవోఎస్‌లోనే ఉంది
Mobile Ears  ఫ్రీ యాప్‌. అయితే ప్ర‌స్తుతానికి ఐవోఎస్ స్టోర్‌లో మాత్ర‌మే దొరుకుతోంది. ఐ ఫోన్‌,  ఐప్యాడ్‌, ఐ పోడ్ ట‌చ్‌ల‌కు మాత్ర‌మే కంపాట‌బులిటీ ఉంది.  

జన రంజకమైన వార్తలు