ఫేస్బుక్ మనల్ని ట్రాక్ చేస్తుందనే అనుమానం ఉందా? మనం ఎక్కడికి వెళుతున్నామో ఏ లొకేషన్లో ఉన్నామో కూడా ఎఫ్బీలో అప్డేట్ అయిపోతుందా? మరి దీని వల్ల మన ప్రైవసీకి భంగం కాదా? ..కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో అందరికి తెలియకూడదని అనుకుంటాం. కానీ ఎఫ్బీ ట్రాకింగ్ వల్ల మనం ఎక్కడ ఉన్నామో.. మన ఎఫ్బీ స్నేహితులకు తెలిసిపోతుంది. దీని వల్ల మన ప్రైవసీ దెబ్బ తినే అవకాశాలున్నాయి. అందుకే మొజిల్లా ఫైర్ఫాక్స్ కొత్త ఆప్షన్ తెచ్చింది. ఒక ఎక్సటెన్షన్ ద్వారా ఎఫ్బీ మనల్ని ట్రాక్ చేయనీయకుండా చేస్తుంది మరి అదెలాగో చూద్దాం..
ఫేస్బుక్ కంటైనర్
సాధారణంగా ఎఫ్బీ మన కదలికలను ట్రాక్ చేస్తుంది. దీని నుంచి బయటపడడం కోసం మొజిల్లా ఒక కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎఫ్బీ ట్రాకింగ్‌ను అడ్డుకోవడం కోసం మొజిల్లా.. ఫేస్బుక్ కంటైనర్ పేరుతో ఒక ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది యూజర్ల యాక్టివిటీని ఫేస్బుక్ ట్రాక్ చేయకుండా చేస్తుంది. దీని వల్ల ఎఫ్బీ యూజర్‌కు ప్రైవసీ ఇబ్బందులు తలెత్తవు. అయితే ఇది పూర్తిగా మన సమస్యను తీరుస్తుందని చెప్పలేం కానీ .. ప్రస్తుత పరిస్థితి కన్నా మెరుగే అని చెప్పొచ్చు. దీని కోసం యూజర్లు మొజిల్లా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. దీన్ని ఫేస్బుక్ ద్వారా లాగిన్ చేయాలి. 50 మిలియన్ల మంది యూజర్ల డేటాను వారి అనుమతి లేకుండానే ఎఫ్బీ వాడుకుంటుందని ఇటీవల ఫైర్పాక్స్ తన బ్లాగ్ పోస్టులో తెలిపింది.
ఏం చేయాలంటే..
ముందుగా ఫైర్పాక్స్ను మీ డివైజ్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైర్ఫాక్స్ ఎక్స్‌టెన్షన్‌ను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా లాగిన్ కావాలి. ఎప్పటిలాగే మీరు ఫేస్బుక్ బ్రౌజ్ చేసుకోవాలి. కొన్ని రోజుల వాడకం తర్వాత మీకే అర్ధం అవుతుంది ఫేస్బుక్ గతంలోలా మనల్ని ట్రాక్ చేయడం లేదని... మనం ఎక్కడ ఉన్నామో.. ఇతర వివరాలేమి మన యూజర్లకు అందించట్లేదని. అయితే ఫైర్ఫాక్స్ కంటైనర్ ఎక్సటెన్షన్ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉంది.