తరచుగా ఇల్లు మారే వారికి ఫర్నిచర్, టీవీ, ఫ్రిజ్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో తలనొప్పే. ఇక్కడ వాటిని విప్పి, మళ్లీ కొత్తచోట బిగించుకోవడం, టీవీల వంటివైతే కనెక్షన్లు ఇచ్చేవారి కోసం తిరగడం ఇదంతా చాలా హెడేక్. ఇక బ్యాచిలర్స్ అయితే నలుగురైదుగురు కలిసి ఉంటారు. ఏదైనా వస్తువు కొనాలంటే ఎవరెంత వాటా వేయాలనేది క్వశ్చన్. ఆ తర్వాత మరో నెలో ఎవరైనా రూమ్ మారితే అప్పుడు అతని వాటా పరిస్థితి ఏంటి.. ఇలా బోల్డన్ని సందేహాలు.. వీటన్నింటికీ సమాధానంగా ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వంటివి రెంట్ కు ఇప్పించే వెబ్ సైట్లు వచ్చేశాయి. ఇలాంటి కొన్ని వెబ్సైట్ల వివరాలివి..
1. Furlenco
ఈ వెబ్సైట్ బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్, ముంబయి, పుణెల్లో సర్వీస్ అందజేస్తోంది. ఇక్కడ రెంట్‌కు దొరికే ప్రతి వస్తువుకు నెలకు ఇంతని రెంట్, కనీసం ఇన్నాళ్ల వరకు అద్దెకు తీసుకోవాలని రూల్ ఉన్నాయి. ఉదాహరణకు వార్డ్ రోబ్ కావాలంటే కనీసం మూడు నెలలు దాన్ని రెంట్‌కు తీసుకోవాలి. `ఐటమ్ పికప్, డ్రాపింగ్ ఫ్రీ. వారం రోజుల్లో డెలివరీ చేస్తారు. సోఫా కావాలంటే నెలకు 799 రూపాయలు, ఫ్రిజ్ లేదా వాషింగ్ మెషీన్‌కు అయితే నెలకు 2వేలు రెంట్ తీసుకుంటారు. 32 ఇంచ్ టీవీ, సోఫా, ఫ్లోర్ లాంప్ కలిపి కాంబో ఆఫర్ ఉంది. దీని రెంట్ పర్ మంత్ 2,350 రూపాయలు. ఇలాంటి ఆఫర్లు చాలా ఉన్నాయి. 10వేల వరకు డ్యామేజీ కవర్ చేస్తారు. ఒక ఫ్రీ క్లీనింగ్ ఆఫర్ కూడా ఉంది. ఒక నెల రెంట్‌ను ఫ్లురెంకో డిపాజిట్‌గా తీసుకుంటుంది.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ లలో Furlenco యాప్ కూడా అందుబాటులో ఉంది.
2. Rentomojo
రెంట్ మోజో ఇలాంటిదే మరో వెబ్సైట్. 500 రూపాయల టోకెన్ డిపాజిట్ చెల్లించి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ బెంగళూరు, చెన్నై,ఢిల్లీ, గుర్గావ్, ముంబయి, పుణె, హైదరాబాద్ సిటీల్లో సర్వీస్ అందజేస్తోంది. కనీసం మూడు నెలలు రెంట్‌కు తీసుకోవాలి. సోఫా కావాలంటే నెలకు 749 రూపాయలు, డబుల్ బెడ్ అయితే నెలకు 1,089 రెంట్ తీసుకుంటారు. టీవీ, వాషింగ్ మెషిన్, ఫ్రిజ్ కాంబోకి రెంట్ పర్ మంత్ 3,737 రూపాయలు. ఇంకా చాలా ఆఫర్లున్నాయి. చిరిగినా, చిన్నపాటి డ్యామేజిలయినా ఫ్రీ సర్వీసే. ఫ్రీ మెయింటనెన్స్, రీలొకేషన్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎక్కువ కాలం రెంట్‌కు తీసుకునేవారికి రెంట్ కూడా బాగా తగ్గిస్తారు.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ లలో Rentomojo యాప్ కూడా అందుబాటులో ఉంది.
3. SabRentKaro
సబ్రెంట్ కరో వెబ్సైట్ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్. విశాఖపట్నం సిటీల్లో సర్వీస్ అందజేస్తోంది. మార్కెట్ ప్లేస్ మోడల్లో పని చేస్తుంది. అంటే ఫర్నీచర్, గ్యాడ్జెట్స్, బైకులు కూడా ఈ సైట్లో లిస్ట్ చేయొచ్చు. దీన్ని రెంట్‌కు కావాలన్నవారు తీసుకోవచ్చు. రెంట్ మీద 5% హ్యాండ్లింగ్ ఫీజుగా వెబ్సైట్ తీసుకుంటుంది. దీనిలో Rent2Own అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే ఒక ప్రొడక్ట్‌ను చాలా కాలం వాడుకున్నాక కావాలంటేమీరు దాన్ని మిగిలిన అమౌంట్ ఇచ్చి కొనుక్కోవచ్చు కూడా.
Rentmacha, OnlyOnRent, GO RENT IT, MustRent ఇలా చాలా యాప్‌లు, వెబ్సైట్లను కూడా చూడొచ్చు.