• తాజా వార్తలు

సింగిల్ ట‌చ్‌తో  మీ స్ట‌ఫ్‌నంతా స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసే కొత్త యాప్ 

స్క్రీన్‌షాట్ క్యాప్చ‌ర్ చేసి లేదా   ఏదైనా లింక్  కాపీ చేసి వాటిని సేవ్ చేయ‌డం స్మార్ట్‌ఫోన్‌లో గంద‌ర‌గోళం వ్య‌వ‌హార‌మే. దీన్ని ఈజీ చేసేందుకు సింగిల్ బ‌ట‌న్‌తో ఉప‌యోగ‌ప‌డే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వ‌డోద‌ర‌కు చెందిన ఓ స్టార్ట‌ప్ కంపెనీ. సోషియోర్యాక్ (SocioRAC)అనే ఈ యాప్‌తో యూజ‌ర్లు మెసేజ్‌లు, స్క్రీన్‌షాట్లు, లింక్‌లు, ఫొటోలు ఇలాంటివ‌న్నీ సింగిల్ బ‌ట‌న్ ట‌చ్‌తో సేవ్ చేసుకోవ‌చ్చు. 

ర‌జ‌త్ సింఘానియా అనే వ్య‌క్తి మొబైల్ టెక్నో అనే స్టార్ట‌ప్ సంస్థ‌ను ప్రారంభించారు. స్క్రీన్‌షాట్ తీసుకోవ‌డం, లింక్స్ కాపీ చేసి సేవ్ చేసుకోవ‌డం వంటి వాటిలో ఉన్న ఇబ్బందుల‌ను ఆయ‌న గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ ఒక లింక్‌ను కాపీ చేస్తే,  ఆ విండో నుంచి ఎగ్జిట్ కావాలి. ఆ త‌ర్వాత దాన్ని ఏదో మెయిల్ అడ్ర‌స్ లేదా వాట్సాప్ నంబ‌ర్‌కు పంపించి సేవ్ చేసుకోవాలి. లేదంటే నోట్‌లో సేవ్ చేసుకోవాలి. మా యాప్ వాడితే చాలు ఆ మెసేజ్‌ను క్లిక్ చేయ‌గానే మీరు కోరుకున్న ఫోల్డ‌ర్‌లో మెసేజ్ సేవ్ అవుతుంది. 
ఈ యాప్ తో యూజ‌ర్లు  ఫొటోలు, లింక్స్‌, డాక్యుమెంట్స్‌, మెసేజ్‌లు సేవ్ చేసుకోవ‌డానికి ఆర్కైవ్స్ ఫోల్డ‌ర్ ఉంటుంది. ప‌ర్స‌న‌ల్‌, వర్క్ రిలేటెడ్ ఇలా డిఫ‌రెంట్ హెడ్స్ కింద కూడా ఫోల్డ‌ర్స్ క్రియేట్ చేసుకోవ‌చ్చు. మీరు చూసిన మెసేజ్‌ను, లేదా లింక్‌ను ఏ ఫోల్డ‌ర్‌లో సేవ్ చేయాలో క్లిక్ చేస్తే ఆ ఫోల్డ‌ర్‌లో నేరుగా సేవ్ అయిపోతోంది.  అంతేకాదు ఫోన్ మెమ‌రీని వేస్ట్ చేయ‌కుండా ఈ స్ట‌ఫ్ అంతా నేరుగా క్లౌడ్‌లో సేవ్ అయ్యేలా ఆప్ష‌న్ కూడా ఉంది.  గ్రూప్‌లో ఒక‌రికి ఈ యాప్ ఉంటే ఆ సేవ్డ్ మెటీరియ‌ల్‌ను సెండ్ కూడా చేయొచ్చు.  దేశ‌విదేశాల స్టార్ట‌ప్ కంపెనీల నుంచి టాప్ 50 యాప్స్‌లో SocioRAC చోటు ద‌క్కించుకుంది. మెసేజింగ్‌లో వాట్సాప్ ఎంత ఛేంజ్ తీసుకొచ్చిందే స్ట‌ఫ్‌ను సేవ్ చేసుకోవ‌డంలో SocioRAC కూడా అంతే బాగా ప‌ని చేస్తుంద‌ని సింఘానియా ధీమాగా చెబుతున్నారు.  
 

జన రంజకమైన వార్తలు